న్యూఢిల్లీ:థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ నిల్వలు క్రమేపీ తగ్గిపోవడంతో మరోసారి విద్యుత్ సంక్షోభం తలెత్తే పరిస్థితి కనిపిస్తోంది. బొగ్గు కొరత కారణంగా విద్యుత్ సరఫరా తీవ్ర అంతరాయం ఏర్పడనుంది. దేశ వ్యాప్తంగా ఉన్న థర్మల్ కేంద్రాల్లో రెండు రోజులకు మాత్రమే సరిపడా నిల్వలు మాత్రమే ఉండటంతో విద్యుత్ సరఫరాకు ముప్పు వాటిల్లే పరిస్థితిలే అధికంగా ఉన్నాయి. బొగ్గు కొరత కారణంగా ఆరు విద్యుత్ కేంద్రాలు మూతపడే పరిస్థితి కనిపిస్తుండగా. మరో 46 కేంద్రాల్లో వారం రోజులకు సరిపడ బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయి.
దీంతో బొగ్గు ఇవ్వకుంటే విద్యుత్ సరఫరా కష్టమని కేంద్రానికి ఎన్టీపీసీ స్పష్టం చేసింది. విద్యుత్ కొరతను నివారించేందుకు కేంద్రం ఆగమేఘాలపై చర్యలు చేపట్టింది. ఒడిశా, జార్ఘండ్ నుంచి బొగ్గు తరలింపునకు ప్రయత్నాలు ఆరంభించింది.