న్యూఢిల్లీ: కేజీ బేసిన్‌లో చమురు, సహజ వాయువు నిక్షేపాల ఉత్పత్తి నిమిత్తం ఓఎన్‌జీసీ భారీగా పెట్టుబడులు పెట్టనున్నది. 2017-18 కల్లా 900 కోట్ల డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టనున్నామని ఓఎన్‌జీసీ డెరైక్టర్ (ఎక్స్‌ప్లోరేషన్) ఎన్.కె. వర్మ తెలిపారు. రిలయన్స్ కేజీ-డి6 బ్లాక్‌కు పక్కనున్న కేజీ-డీడబ్ల్యూఎన్-98/2లో 11 చమురు, గ్యాస్ నిక్షేపాలను కనుగొన్నామని, నార్తర్న్ డిస్కవరీ ఏరియా(ఎన్‌డీఏ) బ్లాక్ నుంచి ఏడాదికి 2.5-3 మిలియన్ టన్నులు చమురును, రోజుకు 9-10 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను ఉత్పత్తి చేయాలనుకుంటున్నామని వివరించారు. ఎన్‌డీఏలో 92.30 మిలియన్ టన్నుల చమురు, 97.568 బిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయని అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు.
కేజీ బేసిన్‌లో ఓఎన్‌జీసీ భారీ పెట్టుబడులు
Published Mon, Jan 6 2014 2:14 AM | Last Updated on Sat, Sep 2 2017 2:19 AM
Advertisement