పీహెచ్ డీ, పీజీలు చేసిన వాళ్లు..
చదివిన చదువులు పెద్దవి.. ఆశపడే ఉద్యోగాలు చిన్నవి. చిన్న ఉద్యోగాలపై మోజుకాదుకానీ.. ఉద్యోగం వస్తే చాలనుకునేంత పరిస్థితి. మరోపక్క అర్హతకు తగిన ఉద్యోగాలను అందించలేని పరిస్థితి ప్రభుత్వాలది. వెరసి ప్రభుత్వ ఉద్యోగానికి ఇలా నోటిఫికేషన్ పడిందో అలా వెంటనే ఇంటర్ నుంచి పీహెచ్డీ వరకు ఉద్యోగాలకోసం దరఖాస్తు చేసుకుంటూనే ఉన్నారు.
మరోసారి మధ్యప్రదేశ్ లో పరిస్థితి దీనంతటికి అద్దం పడుతోంది. మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డు(ఎమ్పీపీఈబీ) తాజాగా నోటిఫికేషన్ ఇచ్చిన 14,000 కానిస్టేబుల్ పోస్టులకు మొత్తం తొమ్మిది లక్షల అప్లికేషన్లురాగా, వాటిలో పీహెచ్ డీ, పీజీలు పూర్తి చేసిన అభ్యర్థుల నుంచి వచ్చిన అప్లికేషన్లు భారీగా ఉన్నాయి. 1.19 లక్షల మంది డిగ్రీ ,14,652 మంది పీజీ, 9,629 మంది ఇంజనీర్లు, 12 మంది పీహెచ్ డీ పూర్తి చేసిన వారు ఉన్నారు.
మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డు(ఎమ్పీపీఈబీ) తాజాగా నోటిఫికేషన్ ఇచ్చిన 14,000 కానిస్టేబుల్ పోస్టులకు మొత్తం తొమ్మిది లక్షల అప్లికేషన్లురాగా, వాటిలో పీహెచ్ డీ, పీజీలు పూర్తి చేసిన అభ్యర్థుల నుంచి వచ్చిన అప్లికేషన్లు భారీగా ఉన్నాయి. 1.19 లక్షల మంది డిగ్రీ ,14,652 మంది పీజీ, 9,629 మంది ఇంజనీర్లు, 12 మంది పీహెచ్ డీ పూర్తి చేసిన వారు ఉన్నారు.
కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు కనీస విద్యార్హత ఇంటర్ కాగా, పీహెచ్ డీ, ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకున్నారని ఎమ్పీపీఈబీ డైరెక్టర్ భాస్కర్ తెలిపారు. కానిస్టేబుల్ పోస్టులకు రాత పరీక్ష వచ్చేనెల 17న నిర్వహించనున్నట్లు వివరించారు. ఇంటర్ విద్యార్హతతో దాదాపు 5 లక్షల మంది దరఖాస్తు చేశారని చెప్పారు. 3,438 మంది డిప్లొమా చేసిన వారు కూడా దరఖాస్తు చేశారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు చదువు, వయోపరిమితుల నుంచి సడలింపు ఉండటంతో దాదాపు 2.58 లక్షల ఆశావాహులు దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కనీస విద్యార్హత ఎనిమిదవ తరగతి అని తెలిపారు.