చత్తీస్గఢ్లో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ | Peaceful polling in Chhattisgarh | Sakshi
Sakshi News home page

చత్తీస్గఢ్లో ప్రశాంతంగా ముగిసిన పలింగ్

Published Tue, Nov 19 2013 5:13 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM

చత్తీస్గఢ్లో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ - Sakshi

చత్తీస్గఢ్లో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

రాయ్పూర్: ఛత్తీస్గఢ్ శాసనసభకు జరిగిన తుది దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ రోజు సాయంత్రం వరకు నాలుగు మిలియన్ల మందికిపైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్లు భారీ సంఖ్యలో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తుది దశ పోలింగ్ 74.67 శాతం జరిగినట్లు పోలీసులు తెలిపారు. కొన్ని నియోజకవర్గాల్లో ఓటర్లు పోలింగ్ బూత్ల వద్ద బారులు తీరారగా, మరికొన్ని చోట్ల చాలా అత్యల్పంగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు.  ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి కుమారుడు అమిత్ జోగి బరిలో నిలిచిన మర్వాహి నియోజకవర్గంలో దాదాపు నలభై శాతానికి పైగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
 

రాష్ట్రంలో బిలాస్పూర్ నగరంలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ మినహా రాష్ట్రంలో ఎక్కడ ఎటువంటి చెదురుమదురు ఘటనలు చోటు చేసుకోలేదు. మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉన్న ఛత్తీస్గఢ్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ఎన్నికల సంఘం పటిష్టమైన చర్యలు చేపట్టింది. మహాసంముంద్ జిల్లాలోని సరైపల్లి నియోజకవర్గంలో ఓట్లర్లు అత్యల్పంగా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement