
స్థలం మీదే.. చెట్టూ మీదే!
ఫామ్ ప్లాట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన సిరి సంపద
హైదరాబాద్: భవిష్యత్తు అవసరాల కోసం హైదరాబాద్‌లో ఓ ప్లాట్ కొనాలని కోరిక సురేష్‌ది. కాకపోతే రోజూ సైట్‌కెళ్లి చూసుకునే ప్లాట్‌నే రాత్రికి రాత్రే కబ్జా చేసే నగరంలో కొనాలంటేనే కాసింత భయం. ఇలాంటి పరిస్థితి ఒక్క సురేష్‌కే కాదు మనలో చాలా మందిదే. అయితే కొనుగోలుదారులకు ఇలాంటి చిక్కులేవీ లేకుండా ప్లాట్‌పై 24 గంటలు నిఘా వేయటమే కాదు.. 15 ఏళ్ల తర్వాత మీరు పెట్టిన పెట్టుబడులపై పెద్ద మొత్తంలోనే లాభం వచ్చేలా సరికొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది సిరి సంపద ఫామ్‌ల్యాండ్స్ ప్రై.లి. ఈ సందర్భంగా సంస్థ డెరైక్టర్ రాఘవేంద్ర ‘సాక్షి రియల్టీ’తో మాట్లాడారు. ఇంకా ఏమన్నారంటే..
హైదరాబాద్‌లో స్థిరాస్తి వ్యాపారమంటే కొనుగోలుదారులకు అమ్మేసి డబ్బులు చేసుకోవడం మాత్రమే కాదు.. దాన్ని ఓ సామాజిక కోణంలో ఎందుకు చేపట్టకూడదని నిర్ణయించుకున్నా. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ప్లాట్లపై పెట్టుబడి పెట్టేవారికి ఆయా ప్లాట్లలో విలువైన శ్రీగంధం చెట్లను పెంచి వాటి లాభాలనూ కొనుగోలుదారులకు అందించాలనే ఉద్దేశంతో షాద్‌నగర్ నుంచి 6 కి.మీ. దూరంలోని సర్ధార్‌నగర్‌లో 120 ఎకరాల్లో గోల్డెన్ ఉడ్స్ పేరుతో ఫామ్ ప్లాట్స్‌ను ప్రారంభించాం. రెండు జాతీయ రహదారుల మధ్య ఒకవైపు 100 ఫీట్ల 4 లైన్ల రోడ్డు... మరోవైపు 300 ఫీట్ల రీజినల్ రింగ్ రోడ్‌ల మధ్యలో ఇళ్లకు ఆనుకొని ఈ ప్రాజెక్ట్‌ఉంది.
ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత ఏంటంటే.. రోజురోజుకూ విపరీతమైన డిమాండ్ ఉన్న శ్రీగంధం చెట్లను పెంచటమే. ఒక్కో ఫామ్‌ప్లాట్ 121/గుంట గజాలుంటుంది. అందుబాటు ధరల్లో సులభమైన వాయిదా పద్ధతుల్లో అందిస్తున్నాం. ఆ తర్వాత ఫామ్‌ప్లాట్‌ను కొనుగోలుదారుల దగ్గర్నుంచి లీజుకు తీసుకొని శాస్త్రవేత్తల పర్యవేక్షణలో శ్రీగంధం చెట్లను పెంచుతాం. ఎలాంటి అదనపు సొమ్ము వసూలు చేయకుండా వాటి సంరక్షణ బాధ్యత పూర్తిగా కంపెనీయే భరిస్తూ 15 ఏళ్ల తర్వాత చెట్లను విక్రయిస్తాం. ఇందులో వచ్చిన సొమ్మును 60:40 నిష్పత్తితో కొనుగోలుదారునికి, సంస్థకు పంచుతాం.
ఔషధాలు, కాస్మోటిక్స్ తయారీలో, ఆధ్యాత్మిక వినియోగంలో ఎంతగానో ఉపయోగపడే శ్రీగంధం చెట్లకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. ఇక్కడి వాతావరణంలో శ్రీగంధం చెట్లు పెరుగుతాయా అనే సందేహం అందరిది. ఇక్కడి నేల ఎర్రనేల. ఇది శ్రీగంధం చెట్లకు పూర్తిగా అనుకూలం. కేరళ నుంచి విత్తనాలను దిగుమతి చేసుకొని.. ఇక్కడి వాతావరణానికి తగ్గట్టుగా శాస్త్రీయ పద్ధతుల్లో పండిస్తున్నాం. ప్రాజెక్ట్‌లో సొంతంగా నర్సరీ కూడా ఉంది.