
ప్లాస్టిక్ బాటిల్స్ సురక్షితమేనా..?
ఇకపై మీరు వాటర్ బాటిల్ కొని తాగడానికి ముందు దాని కిందభాగాన్ని ఒకసారి చూడండి. ఏం కనిపిస్తాయి? ఎప్పుడైనా పరిశీలించారా? అయితే జాగ్రత్తగా చూడండి. ఎన్నో రకాల ప్లాస్టిక్స్ ఉన్నాయి కదా! వాటిలో ఏ తరహా ప్లాస్టిక్‌తో ఆ వాటర్ బాటిల్ తయారు చేశారో తెలియజేస్తూ బాటిల్ కింద దానికి చెందిన లెటర్స్‌ను ప్రింట్ చేస్తారు. మరి వాటిలో మనకు ఏది మంచిదో, ఏది హానికరమో కింద చూడండి.
పీఈటీఈ లేదా పీఈటీ - వాటర్ బాటిల్ కింద ఈ లెటర్స్ ప్రింట్ చేసి ఉంటే జాగ్రత్త. ఎందుకంటే ఈ ప్లాస్టిక్‌తో తయారు చేసిన వాటర్ బాటిల్స్‌లో నీరు పోస్తే ఆ నీటిలోకి ప్రమాదకరమైన విషపదార్థాలు విడుదల అవుతాయట! ఆ క్రమంలో ఆ నీటిని తాగడం మంచిది కాదట.
హెచ్‌డీపీఈ లేదా హెచ్‌డీపీ - వాటర్ బాటిల్ కింద ఈ లెటర్స్ ఉంటే అప్పుడు ఆ బాటిల్‌లోని నీటిని మనం నిరభ్యంతరంగా తాగవచ్చు. ఆ నీటిలోకి ఎలాంటి ప్లాస్టిక్ అవశేషాలు చేరవు. అవి పూర్తిగా సురక్షితమైనవి. మనకు ఎలాంటి హాని కలిగించవు.
పీవీసీ లేదా 3వీ - ఈ లెటర్స్ ఉన్నా జాగ్రత్తగా చూడాలి. ఎందకంటే ఈ ప్లాస్టిక్ వల్ల నీటిలోకి కొన్ని రకాల విష పదార్థాలు చేరుతాయి. అవి మన శరీరంలో హార్మోన్ అసమతుల్యతను కలిగిస్తాయి.
ఎల్‌డీపీఈ - ఈ ప్లాస్టిక్‌తో చేసిన వాటర్ బాటిల్స్ మనకు శ్రేయస్కరమే. వీటి నుంచి ఎలాంటి వ్యర్థాలు నీటిలో చేరవు. కానీ ఈ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ తయారీకి పనికిరాదు. దీంతో ప్లాస్టిక్ బ్యాగ్స్‌ను తయారు చేస్తారు.
పీపీ- పెరుగు కప్పులు, టానిక్‌లు, సిరప్‌లు ఉంచేందుకు వాడే చిన్నపాటి బాటిల్స్‌ను తయారు చేసేందుకు ఈ ప్లాస్టిక్‌ను వాడుతారు. ఇది మనకు సురక్షితమే.
పీఎస్ - ఈ తరహ ప్లాస్టిక్‌తో కాఫీ, టీ కప్పులు తయారు చేస్తారు. అవి వాటిలోకి కార్సినోజెనిక్ సమ్మేళనాలను విడుదల చేస్తాయి. కనుక ఈ తరహా ప్లాస్టిక్‌తో చేసిన వస్తువులను వాడరాదు. లేబుల్ ఏమీ లేకపోయినా లేదా పీసీ అని ఉన్నా ఈ ప్లాస్టిక్ చాలా డేంజర్. జాగ్రత్త పడండి మరి!