బౌద్ధలయాన్ని సందర్శించిన మోడీ | PM Modi visits ancient Buddhist temple in Japan | Sakshi
Sakshi News home page

బౌద్ధలయాన్ని సందర్శించిన మోడీ

Published Sun, Aug 31 2014 8:44 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

బౌద్ధలయాన్ని సందర్శించిన మోడీ - Sakshi

బౌద్ధలయాన్ని సందర్శించిన మోడీ

క్యోటో: జపాన్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ రెండో రోజు టోజీలోని పురాతన పగోడా బౌద్ధలయాన్ని సందర్శించారు. జపాన్ ప్రధాని షింజో అబేతో కలిసి ఆలయానికి వచ్చిన మోడీ ఇక్కడ అరగంటపాటు గడిపారు. చెక్కతో ఐదు అంతస్తుల్లో నిర్మించిన ఈ ఆలయాన్ని ఆసక్తిగా తిలకించారు.

ఎనిమిదో శతాబ్దానికి చెందిన పగోడా బౌద్ధలయ విశేషాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆలయ ప్రధాన బౌద్ధభిక్షువు మోరీ.. ఆలయ విశేషాలను మోడీకి వివరించారు. భారత ప్రధాని తమ ఆలయాన్ని సందర్శిచడం సంతోషంగా ఉందని ఇక్కడి బౌద్ధులు వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement