ఆమె కూడా అన్నలాగే..! | priyanka gandhi also will flop like brother, says subramanian swamy | Sakshi
Sakshi News home page

ఆమె కూడా అన్నలాగే..!

Published Mon, Jan 23 2017 8:02 PM | Last Updated on Tue, Aug 14 2018 9:04 PM

ఆమె కూడా అన్నలాగే..! - Sakshi

ఆమె కూడా అన్నలాగే..!

ప్రియాంకా గాంధీ కూడా తన అన్నయ్య రాహుల్ గాంధీ లాగే ఫ్లాప్ అవుతారని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యం స్వామి జోస్యం చెప్పారు.

ప్రియాంకా గాంధీ కూడా తన అన్నయ్య రాహుల్ గాంధీ లాగే ఫ్లాప్ అవుతారని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యం స్వామి జోస్యం చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో ఓటర్లకు తాము ఇది చేశాం అని చూపించుకోడానికి కాంగ్రెస్ వద్ద ఏమీ లేదని, సమాజ్‌వాదీ సాయంతో యూపీ జలాల్లో చేపలవేట మొదలుపెడుతోందని ఆయన ఎద్దేవా చేశారు. బీఎస్పీ నుంచి ముస్లిం ఓట్లను లాక్కోవాలన్నది వాళ్ల ప్రయత్నమని అన్నారు. ఇక ప్రియాంకాగాంధీ చేసేది కూడా ఏమీ ఉండబోదని.. అక్కడ ఎన్నికల్లో యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవే కీలకంగా వ్యవహరిస్తారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గానీ, నెహ్రూ కుటుంబం నుంచి గానీ ఎవరూ ఎన్నికల ప్రచారంలో కీలకంగా వ్యవహరించే అవకాశమే లేదన్నారు. 
 
మొత్తం 403 మంది సభ్యులున్న యూపీ అసెంబ్లీలో బీజేపీ మెజారిటీ సాధిస్తుందన్న నమ్మకాన్ని స్వామి వ్యక్తం చేశారు. ఆ రాష్ట్రంలో ఫిబ్రవరి 11 నుంచి ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. సమాజ్‌వాదీ - కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు విషయంలో ప్రియాంకా గాంధీ పాత్ర ఉందన్న విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్ కూడా ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే సుబ్రమణ్యం స్వామి ఈ వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement