మతవాది మోడీ కంటే రాహుల్ బెటర్: లాలూ
పాట్నా: దేశానికి ప్రధాని అయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి అర్హత ఉందని రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యానించారు. మతవాది నరేంద్రమోడీ కంటే రాహుల్ మెరుగైన వ్యక్తి అని ఆయన అన్నారు. ప్రధాని కావడానికి ఆయనకు ఏం తక్కువ? అని లాలూ ప్రశ్నించారు.
దేశ అత్యున్నత పదవిని చేపట్టడానికి అన్ని అర్హతలున్న వ్యక్తి రాహుల్ అని స్పష్టం అన్నారు. మత ఘర్షణలు రెచ్చగొట్టే విధంగా, సమాజానికి హాని చేసే విధంగా రాహుల్ ఏమైనా ప్రవర్తించారా అంటూ నిలదీశారు. గాంధీ కుటుంబానికి మద్దతుగా నిలువడంతోనే నన్ను బలి పశువును చేశారన్నారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై చర్చిస్తామని లాలూ తెలిపారు.