ఎల్లుండి నుంచి రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం | Rahul Gandhi to start campaign in Rajasthan on March 10 | Sakshi
Sakshi News home page

ఎల్లుండి నుంచి రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం

Published Sat, Mar 8 2014 3:14 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

ఎల్లుండి నుంచి రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం - Sakshi

ఎల్లుండి నుంచి రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని సోమవారం రాజస్థాన్లో ప్రారంభిస్తారు. అక్కడి టోంక్ జిల్లా డియోలీ పట్టణంలో బహిరంగసభలో ప్రసంగిస్తారు. అదేరోజు బికనీర్ జిల్లా కోలయట్ తాలూకాకు కూడా వెళ్తారు. అక్కడ కూలీలతో మాట్లాడతారని రాజస్థాన్ పీసీసీ అధికార ప్రతినిధి అర్చనా శర్మ తెలిపారు. టోంక్ జిల్లాలో ర్యాలీకి సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయన్నారు. రాజస్థాన్ పీసీసీ చీఫ్ సచిన్ పైలట్, ఇతర సీనియర్ నాయకులు, కార్యకర్తలు కూడా ర్యాలీలోపాల్గొంటారు.

అయితే, గతంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ ప్రచారం చేసినచోట్ల, అంతకుముందు ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాల్లో కూడా ఎక్కడా కాంగ్రెస్ పార్టీ గెలిచిన పాపాన పోలేదు. కానీ ఈ సెంటిమెంటును కాంగ్రెస్ నాయకులు మాత్రం అంగీకరించరు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement