
'ఆడపిల్లను కన్నందుకు అభినందనలు'
జైపూర్: రాజస్థాన్ లో బాలికల సంఖ్య పెంచేందుకు ముఖ్యమంత్రి వసుంధరా రాజే కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులను అభినందిస్తూ తన సందేశంతో కూడిన లేఖలను అందజేయాలని ఆమె నిర్ణయించారు. ప్రింటెడ్ ఫామ్ లో ఉన్న ఈ సందేశాన్ని బుధవారం తన అధికారిక నివాసంలో రాజే ఆవిష్కరించారు.
అక్టోబర్ 11 నుంచి డివిజనల్ స్థాయి ప్రభుత్వాసుపత్రుల్లో దీన్ని అమలు చేయనున్నారు. బాలల దినోత్సవం నుంచి అన్ని ఆస్పత్రుల్లో దీన్ని అమలుచేస్తారు. ఏ రంగంలోనైనా రాణించే సత్తా బాలికలకు ఉందని ఈ సందర్భంగా వసుంధర రాజే అన్నారు. అవకాశాలు కల్పిస్తే వారు ప్రతిభ చూపుతారని చెప్పారు.