రానా అందుకే రాలేదు..! | Rana gives clarification on twitter | Sakshi
Sakshi News home page

రానా అందుకే రాలేదు..!

Published Sun, Oct 23 2016 6:45 PM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

రానా అందుకే రాలేదు..! - Sakshi

రానా అందుకే రాలేదు..!

అందరూ ఆసక్తికగా ఎదురుచూస్తున్న 'బాహుబలి-2' సినిమా ఫస్ట్‌ లుక్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో ముంబైలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు 'బాహుబలి' ప్రభాస్‌తోపాటు, దర్శకుడు రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డ, కథానాయికలు అనుష్క, తమన్నా హాజరయ్యారు. అయితే, 'బాహుబలి' సినిమాలో అత్యంత కీలకమైన భల్లాల దేవ పాత్ర పోషించిన రానా ఈ వేడుకలో కనిపించకపోవడం అభిమానుల్ని ఆశ్చర్యపరిచింది.

రానా ఎందుకు రాలేదని అభిమానులు ఆరా తీస్తుండగానే.. ఈ విషయంలో ఎలాంటి ఊహాగానాలకు తావివ్వకుండా రానా వివరణ ఇచ్చాడు. 'బాహుబలి-2' ఫస్ట్‌ లుక్‌ లాంచ్‌కు రాలేకపోయినందుకు ఆయన ట్విట్టర్‌లో క్షమాపణలు చెప్పాడు. ప్రస్తుతం ఓ తమిళ సినిమా కోసం రానా తమిళనాడులోని మారుమూల పల్లెలో షూటింగ్‌ చేస్తున్నాడు. ఎయిర్‌పోర్టు నుంచి మూడు గంటలపాటు ప్రయాణిస్తే తప్ప ఆ ప్రదేశానికి చేరుకోలేం. కాబట్టి షూటింగ్‌ను మధ్యలో వదిలేసి రాలేక 'బాహుబలి' వేడుకకు దూరంగా ఉన్నట్టు రానా వివరణ ఇచ్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement