బాహుబలిని మించే స్థాయి యాక్షన్ ఎపిసోడ్స్ | Baahubali 2 action episodes to be grander than Baahubali | Sakshi
Sakshi News home page

బాహుబలిని మించే స్థాయి యాక్షన్ ఎపిసోడ్స్

Published Sat, Oct 15 2016 10:43 AM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

బాహుబలిని మించే స్థాయి యాక్షన్ ఎపిసోడ్స్ - Sakshi

బాహుబలిని మించే స్థాయి యాక్షన్ ఎపిసోడ్స్

బాహుబలి సినిమాతో ప్రపంచ సినీ అభిమానుల దృష్టిని ఆకర్షించిన దర్శకధీరుడు రాజమౌళి, ఇప్పుడు ఆ సినిమా సీక్వల్‌ను మరింత భారీగా తెరకెక్కిస్తున్నారు. దాదాపుగా షూటింగ్ పూర్తి కావచ్చిన ఈ సినిమా ఏప్రిల్ 28, 2017లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు బాహుబలి టీం.

తాజాగా బాహుబలి 2కు సంబందించిన తన షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసిన రానా, ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. బాహుబలి 2 క్లైమాక్స్‌లో వచ్చే యుద్ధంలో.., గతంలో తెలుగు తెర మీద చూడని స్థాయిలో భారీగా ఉంటుందటూ అభిమానుల అంచనాలను మరింతగా పెంచేస్తున్నాడు. ఇప్పటికే సోషల్ మీడియాలో దర్శనమిస్తున్న ఆన్‌లోకేషన్ ఫోటోలు రానా మాటలకు మరింత బలాన్నిస్తున్నాయి.

ఈ నెల 22న సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అవుతుండగా, ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా 23న టీజర్‌ను రిలీజ్ చేయనున్నారు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న బాహుబలి తొలి భాగం 600 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా, రెండో భాగం అంతకు మించి వసూళ్ల సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement