అమెరికా దృష్టికి వీసా సమస్యలు: రవిశంకర్‌ | Ravi Shankar Prasad raises visa concerns with US | Sakshi

అమెరికా దృష్టికి వీసా సమస్యలు: రవిశంకర్‌

Mar 8 2017 3:20 PM | Updated on Aug 24 2018 8:18 PM

హెచ్‌–1బీ వీసా ప్రాసెసింగ్‌పై ఆంక్షలు విధించడం పట్ల భారత్‌ తన ఆందోళనను అమెరికా ప్రభుత్వ అత్యున్నత వర్గాల దృష్టికి తీసుకెళ్లిందని రవిశంకర్‌ ప్రసాద్ తెలిపారు.

న్యూఢిల్లీ: ఐటీ నిపుణులకు ఉపయుక్తమైన హెచ్‌–1బీ వీసా ప్రాసెసింగ్‌పై ఆంక్షలు విధించడం పట్ల భారత్‌ తన ఆందోళనను అమెరికా ప్రభుత్వ అత్యున్నత వర్గాల దృష్టికి తీసుకెళ్లిందని కేంద్ర సమాచార సాంకేతికత శాఖమంత్రి రవిశంకర్‌ ప్రసాద్ తెలిపారు. ఐసీఈజీఓవీ సదస్సు సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భారత ఐటీ నిపుణులు అమెరికా కంపెనీలకు విలువను జోడిస్తున్నారని పేర్కొన్నారు.

భారత ఐటీ కంపెనీలు ఫార్చ్యూన్‌–500 జాబితాలోని 75 శాతం కంపెనీలకు సేవలందిస్తున్నాయని చెప్పారు. అవి అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మొత్తం సుమారు 4లక్షల ఉద్యోగాలు కల్పించాయన్నారు. భారత ఐటీ నిపుణులు, కంపెనీలు అమెరికా కంపెనీలకు భారత్‌లో అవకాశాలు కల్పిస్తున్నాయని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement