
పెరిగిన రిలయన్స్ ఇన్‌ఫ్రా లాభాలు
ముంబై:రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏకీకృత నికరలాభంలో ఏడు శాతం పెరుగుదలను కనబర్చింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికిగాను తొలి త్రైమాసికం ఫలితాలను మంగళవారం ప్రకటించింది. ఈ ఫలితాల్లో రూ 439 కోట్ల నికర లాభాలను ఆర్జించినట్టు తెలిపింది. గత ఏడాది ఇదే కాలంలో ఇది రూ. 409 కోట్లుగా వుంది.
అయితే కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన కంపెనీ మొత్తం ఆదాయం స్వల్పంగా తగ్గింది. గత ఏడాది రూ. 7,644కోట్ల ఆదాయంతో పోలిస్తే ప్రస్తుతం రూ. 7,640కోట్ల ఆదాయాన్ని గడించింది. కంపెనీ ఏకీకృత నికర విలువ క్వార్టర్ చివర్లో రూ 25.920 కోట్లు నమోదైంది. వడ్డీ , పన్నులు, తరుగుదల (ఈబీఐటీడీఏ ) 4 శాతం వృద్ధిని సాధించి రూ 1,751 కోట్లుకు పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో వీటివిలువ రూ 1,691 కోట్లుగా ఉంది.