
కేటీఆర్ క్షమాపణ చెప్పాలి : రేణుకా చౌదరి
సాక్షి, హైదరాబాద్: సెటిలర్లపై అనుచితంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని కేంద్ర మాజీమంత్రి రేణుకాచౌదరి డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో గురువారం విలేకరులతో ఆమె మాట్లాడుతూ.. గ్రేటర్ ఎన్నికల్లో ప్రయోజనం కోసమే ఇప్పుడు కేటీఆర్ తాను కూడా సెటిలర్‌నే అంటూ ప్రజల్ని మభ్యపెడుతున్నార న్నారు. తాను కూడా సెటిలర్‌నేనంటున్న కేటీఆర్‌కు గతంలో హైదరాబాద్ నుంచి సెటిలర్లు భాగో అంటూ చేసిన వ్యాఖ్యలు గుర్తులేవా అని ఆమె ప్రశ్నించారు. సెటిలర్ అనే పదాన్ని సృష్టించింది టీఆర్‌ఎస్సే అని రేణుకాచౌదరి ఆరోపించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఓట్ల కోసం టీఆర్‌ఎస్ నేతలు, మంత్రి కేటీఆర్ మాట మారుస్తున్నార న్నారు.