
'ఆ హీరోకు అసలు బ్రెయినే లేదు'
ప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు. కనీసం చట్టాలు గురించి అతనికి తెలియదు. ఏదైనా తెలుసుకుని మాట్లాడాలి. ప్రపంచంలో ఏం జరుగుతుందో డైలీ న్యూస్ పేపర్లు చూస్తే విషయం తెలుస్తుంది'
ముంబై:' ఎప్పుడు ఏం మాట్లాడతాడో అతనికి తెలియదు. కనీసం చట్టాలు గురించి కూడా తెలియదు. ఏదైనా తెలుసుకుని మాట్లాడాలి. ప్రపంచంలో ఏం జరుగుతుందో డైలీ న్యూస్ పేపర్లు చూస్తే విషయం తెలుస్తుంది' అని బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పై నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ థాక్రే మండిపడ్డారు. ముంబై దాడుల సూత్రధారి యాకుబ్ మెమన్ ఉరి శిక్షను తప్పుబట్టిన సల్మాన్ పై రాజ్ థాక్రే ఈ విధంగా విమర్శలు గుప్పించారు.
సల్మాన్ కనీసం పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడు. సల్మాన్ తండ్రి చాలా గౌరవమైన వ్యక్తి. ముంబై దాడుల్లో ప్రధాన సూత్రధారి అయిన యాకుబ్ మెమెన్ కు ఉరి శిక్షకు వేయడం సరికాదని ఎలా అంటాడు. దేశ అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టు తీర్పును ఎవరైనా ప్రశ్నిస్తారా?, మెమెన్ ఒక ఉగ్రవాది. ఎంతో మంది మరణానికి కారణమయ్యాడు.అటువంటి వ్యక్తిని ఉరి తీయెద్దని సల్మాన్ ఎలా అంటాడని ఒకనాటి స్నేహితుడు రాజ్ థాక్రే ప్రశ్నించారు. దీంతో పాటు బీజేపీ ప్రభుత్వంపై కూడా థాక్రే విమర్శలు గుప్పించారు. దేశంలో అల్లర్లు సృష్టించి ఆందోళనకర పరిస్థితుల్ని స్పష్టించడమే బీజేపీ లక్ష్యమని ఎద్దేవా చేశారు.