
సల్మాన్ నివాసానికి పోటెత్తిన సెలబ్రిటీలు
జైలు శిక్ష పడిన బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు రాజకీయ, సినీ ప్రముఖుల పరామర్శలు వెల్లువెత్తాయి.
ముంబై: జైలు శిక్ష పడిన బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు రాజకీయ, సినీ ప్రముఖుల పరామర్శలు వెల్లువెత్తాయి. బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్ మెంట్ లోని సల్మాన్ నివాసానికి ప్రముఖులు పోటెత్తారు. సల్మాన్ ను కలిసిన వారిలో రాజకీయ నేతలు, నటులు, నిర్మాతలు, దర్శకులు, సింగర్స్, సంగీత దర్శకులు ఉన్నారు.
మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే, కాంగ్రస్ నేత నితేశ్ రాణెలతో పాటు సినీ తారలు ఆమిర్ ఖాన్, రాణి ముఖర్జీ, బిపాసా బసు, ప్రీతి జింతా, సోనాక్షి సిన్హా, సనా ఖాన్, సంగీతా బిజ్లానీ, మలైకా ఆరోరా, డైసీ షా, ప్రేమ్ చోప్రా, సునీల్ శెట్టి, నిఖిల్ ద్వివేది, పులకిత్ శర్మ, నిఖిల్ ద్వివేది తదితరులు సల్లూ భాయ్ ని కలిసి సంఘీభావం తెలిపారు.
2002 హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ కు కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించగా, బాంబే హైకోర్టు 2 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అతడు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై బాంబే హైకోర్టు శుక్రవారం విచారణ జరపనుంది.