ది వీక్ ఒపీనియన్ పోల్
న్యూఢిల్లీ: బిహార్ ఎన్నికల్లో జేడీయూ, ఆర్జేడీ,కాంగ్రెస్‌ల లౌకిక కూటమి బొటాబొటి సీట్లతో విజయం సాధిస్తుందని హన్స రీసెర్చ్ సంస్థ సహకారంతో ‘ది వీక్’ మేగజీన్ నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లో తేలింది. మొత్తం 243 స్థానాలకు గాను ఈ కూటమి 122 సీట్లు గెలుచుకుంటుందని, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 117 సీట్లలో విజయం సాధిస్తుందని ఈ సర్వే అంచనా వేసింది. సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 1 వరకు 40 లోక్‌సభ నియోజకవర్గాల్లో వీక్ ఒపీనియన్ పోల్ నిర్వహించింది. ఎన్డీయేకు వచ్చే 38.7% ఓట్లలో అత్యధికంగా 36.6% శాతం ఓట్లు బీజేపీ సాధిస్తుందని ఈ పోల్‌లో తేలింది.
లౌకిక కూటమి సాధించే 38.2% ఓట్లలో జేడీయూ వాటా 24.8%, ఆర్జేడీ వాటా 10.3%, కాంగ్రెస్ వాటా 2.8% అని పేర్కొంది. బిహార్‌లో పాలన విషయంలో 31% మంది జేడీయూకు, 33% మంది బీజేపీకి మొగ్గు చూపారు. 46% మంది నితీశ్‌కుమారే అత్యంత సమర్థుడైన సీఎం అని తేల్చిచెప్పారు.
లౌకిక కూటమిదే బిహార్!
Published Thu, Oct 15 2015 1:51 AM | Last Updated on Sun, Sep 3 2017 10:57 AM
Advertisement