ముంబై: దేశీయస్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఆరంభ లాభాలను మిడ్ సెషన్ లో కోల్పోయినా చివరికి లాభాల్లోనే ముగిసింది. ముఖ్యంగా ఐటీ, ఫార్మా షేర్ల మద్దతుతో సెన్సెక్స్ 1461 పాయింట్ల లాభపడ్డ28,301 వద్ద, నిఫ్టీ 53 పాయింట్లు లాభపడి 8,778 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంకుల విలీనానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదంతో ఎస్ బీఐ అనుబంధ బ్యాంకుల నష్టాలతో బ్యాంక్ నిఫ్టీ ఆరంభంలో నష్టాలను చవిచూసింది. చివరికి బ్యాంకింగ్ సెక్టార్ కూడా గణనీయమైన లాభాలనే సాధించింది. అటు స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ ఇండెక్స్‌లు లాభపడ్డాయి. ఎఫ్ఎంసీజీ మినహా అన్ని సెక్టార్లు లాభాలతో ముగిశాయి. ముఖ్యంగా రెండు రోజులనష్టాలనుంచి హెల్త్ కేర్, ఐటీ షేర్లు కోలుకున్నాయి. టెక్నాలజీ , ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్ కౌంటర్లలో కొనుగోళ్ల ధోరణి కనిపించింది. సన్ ఫార్మా, టీసీఎస్, ఇన్ఫోసిస్ టాప్ విన్నర్స్‌గా నిలవగా, ఐటీసీ భారతీ ఇన్ఫ్రాటెల్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి. అరబిందో ఫార్మా , టెక్ మహీంద్ర, హెచ్‌సీఎల్ టెక్, టాటా మోటార్స్ డీవీఆర్ మారుతి సుజుకి లాభపడగా, బాష్ , ఏషియన్ పెయింట్స్, బీపీసీఎల్ నష్టపోయాయి. మొత్తంగా మార్కెట్లు పాజిటివ్ నోట్ తోముగిశాయి.
అటు డాలర్ మారకంలో రూపాయ 14 పైసలు నష్టపోయి రూ. 67.04 వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లోపుత్తడి పది గ్రా. 150రూపాయలు ఎగిసి రూ. 29,293 వద్ద ఉంది.
ఐటీ,ఫార్మా అండతో పాజిటివ్‌గా ముగిసిన మార్కెట్లు
Published Thu, Feb 16 2017 4:20 PM | Last Updated on Thu, Sep 27 2018 4:07 PM
Advertisement