నాలుగు రోజుల లాభాలకు బ్రేక్!
Published Thu, Dec 1 2016 4:55 PM | Last Updated on Mon, Sep 4 2017 9:38 PM
వరుసగా నాలుగు రోజుల పాటు ఈక్విటీ బెంచ్మార్కుల్లో కొనసాగిన లాభాలకు గురువారం బ్రేక్ పడింది. అమ్మకాల ఒత్తిడితో నిఫ్టీ కీలకమైన మార్కు 8,200 దిగువకు వచ్చి చేరింది. రిలీఫ్ ర్యాలీ అనంతరం లాభాల స్వీకరణ, బలహీనమైన యూరోపియన్ సంకేతాలకు, అమ్మకాల ఒత్తిడి తోడై మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 92.89 పాయింట్ల నష్టంతో 26,559.92వద్ద, నిఫ్టీ 31.60 పాయింట్ల నష్టంతో 8192.90గా క్లోజ్ అయింది. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.15 క్షీణించింది. స్మాల్ క్యాప్ 0.64 పడిపోయింది. ఎఫ్ఐఐల్లో కొనసాగుతున్న అమ్మకాలతో పాటు, ఆర్బీఐ మానిటరీ పాలసీపై పెట్టుబడిదారులు వేచిచూస్తుండటంతో మార్కెట్లు నష్టాల పాలైనట్టు విశ్లేషకులు చెప్పారు.
నేడు మరోసారి రిలయన్స్ జియో ఇచ్చిన షాక్తో ఇతర టెలికాం స్టాక్స్ భారీగా పతనయ్యాయి. జియో సిమ్పై అందిస్తున్న ఉచిత సేవలు మార్చి 31వరకు పొడిగిస్తున్నట్టు వాటాదారుల సమావేశ అనంతరం రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. ఈ ప్రకటనతో టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ 1.66 శాతం, ఐడియా సెల్యులార్ 5.93 శాతం, రిలయన్స్ కమ్యూనికేషన్ 5.05 శాతం కుదేలయ్యాయి. ఈ సమయంలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ 1 శాతం లాభపడింది.
Advertisement
Advertisement