ఆపవయ్యా.. ఇదేమైనా టీవీ స్టుడియోనా? | separatist was asked to chant bharat mata.., judge rebukes | Sakshi
Sakshi News home page

ఆపవయ్యా.. ఇదేమైనా టీవీ స్టుడియోనా?

Published Fri, Aug 4 2017 11:11 AM | Last Updated on Thu, Sep 27 2018 5:03 PM

వేర్పాటువాదనేత షాబీర్‌ షా(ఫైల్‌) - Sakshi

వేర్పాటువాదనేత షాబీర్‌ షా(ఫైల్‌)

న్యూఢిల్లీ: ‘భారత్‌ మాతా కీ జై..’ కొట్టి దేశభక్తిని నిరూపించుకోవాలంటూ కోర్టు హాలులో నిందితుడికి సవాల్‌ విసిరిన ప్రభుత్వ న్యాయవదిని సాక్షాత్తూ న్యాయమూర్తే తీవ్రంగా మందలించిన సంఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

పదేళ్లనాటి హవాలా కేసులో ప్రముఖ కశ్మీరీ వేర్పాటువాద నేత షాబీర్‌ షాను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) జులై 25న అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఓ హవాలా బ్రోకర్‌ ఇచ్చిన సమాచారం ఆధారంగా షాబీర్‌పై కేసు నమోదుచేసిన ఈడీ అధికారులు.. మరో వారం రోజుల రిమాండ్‌ కోరుతూ ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. దీనిపై గురువారం వాదోపవాదాలు జరిగాయి. విదేశాల నుంచి నిధులు సేకరించి, కశ్మీర్‌లో ఉగ్రవాదానికి ఊతమిస్తున్న షాబీర్‌.. విచారణకు సహకరించడంలేదని, నిజానిజాలు రాబట్టేందుకు మరికొన్నిరోజులు రిమాండ్‌కు అప్పగించాలని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌(ఈడీ తరఫున) వాదించారు. ప్రతిగా డిఫెన్స్‌ లాయర్‌.. చేయని నేరాన్ని ఒప్పుకోవాల్సిందిగా తన క్లయింట్‌ షాపై ఈడీ ఒత్తిడి చేస్తోందని కోర్టుకు తెలిపాడు.

ఈ క్రమంలోనే ప్రభుత్వ లాయర్‌.. షాబీర్‌ షాను సంబోధిస్తూ.. ‘నువ్వు నిజంగా దేశభక్తుడివే అయితే, భారత్‌ మాతాకీ జై..అని బిగ్గరగా అరువు’  అని సవాలు విరిసాడు. దీంతో ఖంగుతిన్న న్యాయమూర్తి.. ‘ఏంటిది? ఇదేమైనా టీవీ స్టుడియో అనుకుంటున్నావా? కోర్టు హాలన్న సంగతి మర్చిపోయావా? సవాళ్లు మానేసి పాయింటుకు రా’ అని తీవ్రంగా మందలించారు. చివరికి, షాబిర్‌షాను ఆరు రోజుల ఈడీ కస్టడీకి అప్పగిస్తూ తీర్పుచెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement