
బాలికపై అత్యాచారం.. నిందితుడి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: టపాసులు ఇప్పిస్తానంటూ తీసుకెళ్లి 8 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఘటన సంచలనం కలిగించింది. ఎల్‌బీనగర్ పరిధిలోని ఎన్‌టీఆర్ నగర్‌లో బాధిత బాలిక తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. సోమవారం రాత్రి తమ్ముడితో కలిసి బయటకు వెళ్లి తిరిగివస్తున్న బాలికపై చిల్లర దొంగ షేక్ జావీద్ అలీ(22) కన్ను పడింది. బాలిక తమ్ముణ్ని ఏమార్చిన జావీద్ టపాసులు కొనిస్తానంటూ ఆ బాలికను ఎన్‌టీఆర్ నగర్ బస్తీ వెనక ఉన్న హుడా స్థలంలోకి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
అక్క కనిపించకపోవడంతో ఆ బాలుడు తల్లికి విషయం చెప్పాడు. గాలింపు చేపట్టగా హుడా స్థలంలో బాలిక కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బాలికను ఆస్పత్రికి తరలించారు. పరారైన జావీద్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడు గతంలో కూడా స్థానిక యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడని, మహిళలను వేధిస్తుంటాడని కాలనీవాసులు తెలిపారు.