న్యూఢిల్లీ : బీహార్ మాజీ సీఎం, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పశుగ్రాసం కుంభకోణం కేసు వ్యవహారం సీబీఐ-సొలిసిటర్ జనరల్ మధ్య చిచ్చు పెట్టింది. లాలుపై దాఖలు చేసిన అభియోగాల్ని కోర్టు తొలగించాలి తప్ప సీబీఐకి ఆ అధికారం లేదని సొలిసిటర్ జనరల్ స్పష్టం చేశారు.
నిర్ణయం తీసుకోవాల్సింది న్యాయస్థానమే కానీ సీబీఐ కాదని అడిషనల్ సొలిసిటర్ జనరల్ పేర్కొంది. కాగా దాణా కుంభకోణంలో మిగిలిన మూడు పెండింగ్ కేసుల్లో అభియోగాల్ని నమోదు చేయరాదని సీబీఐ అభిప్రాయపడుతోంది. అయితే దాణా కేసుల్లో ఒకదాంట్లో లాలూకు ఇప్పటికే శిక్ష పడింది. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నా... శిక్ష కారణంగా ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని లాలూ ప్రసాద్ యాదవ్ కోల్పోయారు.