ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించండి
గోదావరి పుష్కరాలపై సమీక్షలో సీఎం కేసీఆర్
హైదరాబాద్: గోదావరి పుష్కరాలకు రాష్ట్రంలోని ప్రధాన రహదారులన్నీ భక్తులతో నిండిపోయాయని, అందువల్ల ట్రాఫిక్‌ను యుద్ధప్రాతిపదికన క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు.
పుష్కరాలకు ఏర్పాట్లు, ట్రాఫిక్ పరిస్థితిపై సీఎం శనివారం తన అధికార కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మలతో సమీక్షించారు. శని, ఆదివారాలు సెలవులు కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివెళ్తున్నారని వారికి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.