మరోసారి వెంకన్న కొలువులో నాగార్జున! | started the shoot for OmNamoVenkatesaya this morning, says nag | Sakshi
Sakshi News home page

మరోసారి వెంకన్న కొలువులో నాగార్జున!

Published Sat, Jul 2 2016 8:07 PM | Last Updated on Mon, Sep 4 2017 3:59 AM

మరోసారి వెంకన్న కొలువులో నాగార్జున!

మరోసారి వెంకన్న కొలువులో నాగార్జున!

  • ‘నమో వెంకటేశాయ’ షూటింగ్ ప్రారంభం

  • హైదరాబాద్‌: అన్నమయ్య, శ్రీరామదాసు, షిర్డీ సాయి చిత్రాలతో ప్రేక్షకులను భక్తితన్మయత్వంలో ముంచెత్తిన అక్కినేని నాగార్జున మరోసారి భక్తుడిగా ప్రేక్షకులకు ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో ఆయన ప్రధాన పాత్ర పోషిస్తున్న భక్తిరస చిత్రం ‘ఓం నమోవెంకటేశాయ’  షూటింగ్‌ శనివారం ప్రారంభమైంది. ఈ విషయాన్ని నాగార్జున స్వయంగా శనివారం తన ట్విట్టర్‌ ఖాతాలో తెలిపారు. శ్రీ వెంకటేశ్వరస్వామి దయతో ఈరోజు ఉదయం షూటింగ్‌ ప్రారంభమైందని, ఈ అనుభవం ఎంతో బాగుందని పేర్కొంటూ.. సెట్‌లో దిగిన ఒక ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.

    గతంలో ‘అన్నమయ్య’లో వెంకన్న భక్తుడిగా ప్రేక్షకులను అలరించిన నాగార్జున తాజా చిత్రంలోనూ వెంకటేశ్వరస్వామి భక్తుడైన హథీరామ్‌బాబా పాత్రలో కనిపిస్తున్నారు.  ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా.. అనుష్క, ప్రగ్యా జైశ్వాల్‌ కథానాయికలుగా నటించనున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement