రిజర్వు బ్యాంక్ ఎఫెక్ట్: భారీ నష్టాల్లో సెన్సెక్స్!
రిజర్వు బ్యాంక్ ఎఫెక్ట్: భారీ నష్టాల్లో సెన్సెక్స్!
Published Fri, Sep 20 2013 4:09 PM | Last Updated on Fri, Sep 1 2017 10:53 PM
త్రైమాసిక ద్రవ్య పరపతి విధానం సమీక్షలో భాగంగా రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా రెపో రెట్ ను 0.25 శాతం పెంచుతూ తీసుకున్న నిర్ణయంతో స్టాక్ మార్కెట్ సూచీలు ప్రతికూలంగా స్పందించాయి. ఓ దశలో ప్రధాన సూచీ సెన్సెక్స్ 2.7 శాతంతో 559 పాయింట్లు నష్టపోయింది. చివరకి సెన్సెక్స్ 382 పాయింట్ల పతనంలో 20263 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 103 పాయింట్లు కోల్పోయి 6012 వద్ద ముగిసింది.
డీఎల్ఎఫ్ అత్యధికంగా 11 శాతం నష్టపోగా, పీఎన్ బీ 7 శాతం, జయప్రకాశ్ అసోసియేట్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్ 5 శాతానికి పైగా, రాన్ బాక్సీ 5 శాతం మేరకు నష్టపోయాయి. అల్డ్రా టెక్ సిమెంట్స్, హెచ్ సీఎల్ టెక్, గెయిల్, రిలయన్స్ ఇన్ ఫ్రా, అంబుజా సిమెంట్స్ లు లాభాలతో ముగిసాయి.
అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్ లో రూపాయి 57 పైసలు క్షీణించి 62.34 వద్ద ట్రేడ్ అవుతోంది.
Advertisement
Advertisement