సూడాన్లో వరదల వల్ల లక్షన్నర మంది నిరాశ్రయులు | Sudan flood: 150,000 affected, more rains expected | Sakshi

సూడాన్లో వరదల వల్ల లక్షన్నర మంది నిరాశ్రయులు

Aug 13 2013 8:51 AM | Updated on Sep 1 2017 9:49 PM

గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సూడాన్ను వరదలు ముంచెత్తాయి.

గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సూడాన్ను వరదలు ముంచెత్తాయి. ఆ వరదల వల్ల ఆచూకీ తెలియకుండా పోయిన వారి సంఖ్య ఇంకా స్పష్టంగా తెలియలేదని ఐక్యరాజ్యసమితికి చెందిన భాగస్వామ్య సంస్థలు మంగళవారం వెల్లడించాయి.  ఆ వరదల కారణంగా దాదాపు లక్షన్నర మంది ప్రజలు నిరాశ్రయులైయ్యారని పేర్కొంది. అయితే వరదల్లో చికుక్కున్న వారిని సహాయక చర్యల్లో భాగంగా పునారావాస కేంద్రాలకు తరలించినట్లు తెలిపాయి.  

 

పునరావాస కేంద్రాల్లో బాధితులకు మొబైల్ ఆరోగ్య కేంద్రాలు, పారిశుద్ధ్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పాయి. స్థానికంగా ఎటువంటి వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా వివిధ చర్యలు చేపట్టినట్లు వివరించింది. కాగా వరద బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నాయి. ఈ నెల ఆరంభం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఎనిమిది రాష్ట్రాల్లోని పాతికవేలకుపైగా ఇళ్లు పూర్తిగా దెబ్బతియన్నాయి. రానున్న రోజుల్లో వర్షాలు ఎడతెరిపిలేకుండా కురుస్తాయని ఐక్యరాజ్యసమితికి చెందిన భాగస్వామ్య సంస్థలు వివరించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement