దావూద్ పై పిటిషన్ ను తిరస్కరించిన సుప్రీం | Supreme Court refuses to entertain plea on bringing Dawood Ibrahim back | Sakshi
Sakshi News home page

దావూద్ పై పిటిషన్ ను తిరస్కరించిన సుప్రీం

Published Wed, Jul 8 2015 3:31 PM | Last Updated on Mon, Oct 8 2018 3:19 PM

దావూద్ పై పిటిషన్ ను తిరస్కరించిన సుప్రీం - Sakshi

దావూద్ పై పిటిషన్ ను తిరస్కరించిన సుప్రీం

న్యూఢిల్లీ: అండర్ వల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంపై దాఖలైన పిటిషన్ విచారణకు స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దావూద్ ఇబ్రహీంను ఇండియాకు తీసుకొచ్చేయ విషయంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని మధ్యప్రదేశ్ ఎమ్మెల్యే  ఒకరు ఈ పిటిషన్ వేశారు.

పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న దావూద్ ను ఇక్కడకు తీసుకురావడంలో దర్యాప్తు సంస్థలు ఎందుకు విఫలమవుతున్నాయో తెలుసుకునేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంతో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని పిటిషనర్ అభ్యర్థించారు. అయితే ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోబోమంటూ పిటిషన్ ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ ఎల్ దత్తు నేతృత్వంలోని బెంచ్ తిరస్కరించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement