న్యూఢిల్లీ:బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామిపై దాఖలైన పరువునష్టం దావా కేసును సుప్రీంకోర్టు నిలుపుదల చేసింది. ఏఐఏడీఎంకే అధినేత్రి జయలలిత దాఖలు చేసిన పిటీషన్ ను గురువారం విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిలో భాగంగానే దీపక్ మిశ్రా, యూయూ లలిత్ లతో కూడిన ధర్మాసనం తమిళనాడు, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. తనపై అపఖ్యాతి మూటగట్టేందుకు ఏఐఏడీఎంకే నేతలు యత్నిస్తున్నారన్న సుబ్రహ్మణ్య వాదనల నేపథ్యంలో కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
చెన్నై సెషన్ కోర్టులో ఉన్న ఐదు పరువునష్టం పిటీషన్ లను కూడా సుప్రీం పెండింగ్ లో పెట్టింది. ప్రజాభిప్రాయం చెప్పే హక్కు ప్రతీ ఒక్కరికీ ఉన్నదని, తనపై వేసిన కేసు రాజ్యాంగ విరుద్దమని సుబ్రహ్మణ్య స్వామి తన వాదనలో పేర్కొన్నారు.