కేంద్ర మంత్రి నారాయణస్వామి కారు కింద బాంబు! | Suspected explosive device found under Narayanasamy's car | Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రి నారాయణస్వామి కారు కింద బాంబు!

Published Wed, Jan 29 2014 1:31 PM | Last Updated on Sat, Sep 2 2017 3:09 AM

Suspected explosive device found under Narayanasamy's car

కేంద్ర మంత్రి వి.నారాయణసామి కారు కింద బాంబును గుర్తించారు. గుర్తుతెలియని వ్యక్తులు పెట్టిన ఈ పరికరాన్ని బాంబు సర్వీసు సిబ్బంది పరిశీలిస్తున్నారు. ఈ విషయాన్ని డీజీపీ పి. కామరాజ్ విలేకరులకు తెలిపారు. ఒక పైపు లాంటి పదార్థానికి రెండు వైర్లు కనెక్ట్ అయి ఉన్నాయని, వాటి రెండు చివర్లా సీల్ చేసి ఉంచారని అన్నారు.

అయితే..  ఈ విషయంలో ఇంకా బాంబు గుర్తింపు, నిర్వీర్య దళం నివేదిక మాత్రం రావాల్సి ఉంది. ప్రస్తుతం నారాయణ సామి మాత్రం ఢిల్లీలో ఉన్నారు. పుదుచ్చేరిలోని ఆయన నివాసం వద్ద ఉన్న కారు కిందే ఈ బాంబు ఉంది. సంఘటన స్థలానికి డీజీపీ వెంటనే చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. తెల్లవారుజామున కారు కింద ఏదో వస్తువు ఉన్నట్లు డ్రైవర్ గుర్తించాడని నారాయణసామి తెలిపారు. పుదుచ్చేరిలో సంఘ వ్యతిరేక శక్తులు పెరుగుతున్నాయనడానికి ఇది నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ చర్యను నిరసిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రదర్శన నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement