అప్రమత్తమైన తెలంగాణ
కరీంనగర్: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మంగళవారం ఉదయం గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట జరిగి 27 మంది మరణించడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. తెలంగాణలో గోదావరి పుష్కరాల సందర్బంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది.
కరీంనగర్ జిల్లాలో హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి పర్యటించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. కాళేశ్వరంలో పుష్కరఘాట్లలో తనిఖీలు చేపట్టారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి, భక్తులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలిన ఆదేశించారు. ఇక మంథనిలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పుష్కరాల ఏర్పాట్లను పరిశీలించారు. మంత్రి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.