తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ త్వరితగతిన పూర్తయ్యేలా సహకరించాలని తెలంగాణ జేఏసీ నాయకులు బీజేపీ నేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ను కోరారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయం అమలయ్యేలా బీజేపీ చొరవ చూపాలని ఆమెకు విజ్ఞప్తి చేసినట్టు జేఏసీ చైర్మన్ కోదండరామ్ ఆదివారం మీడియా సమావేశంలో తెలిపారు.
తమ విన్నపానికి సుష్మా స్వరాజ్ సానుకూలంగా స్పందించారని ఆయన చెప్పారు. తెలంగాణను తొందరగా ఏర్పాటు చేయాలన్న వాదనతో ఆమె ఏకీభవించారని కోదండరామ్ తెలిపారు. ఈ విషయంతో తమ పార్టీ తరపున సాయం చేస్తామని సుష్మా హామీ ఇచ్చారని వెల్లడించారు. మహబూబ్ నగర్లో శనివారం జరిగిన తెలంగాణ ప్రజాగర్జన సదస్సుకు సుష్మా స్వరాజ్ ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే.
తెలంగాణ కోసం సుష్మా స్వరాజ్ సాయం కోరిన జేఏసీ
Published Sun, Sep 29 2013 3:24 PM | Last Updated on Sun, Apr 7 2019 3:47 PM
Advertisement
Advertisement