M Kodandaram
-
ప్రగతి భవన్.. కేసీఆర్ జైలుఖానా
సంగారెడ్డి అర్బన్: ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని సీఎం కేసీఆర్‌కు ప్రగతి భవన్ జైలు ఖానా అయ్యిందని తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఆదివారం సంగారెడ్డిలో టీజేఎస్ ద్వితీయ ప్లీనరీని జిల్లా అధ్యక్షుడు తుల్జారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కోదండరాం మాట్లాడుతూ ప్రగతి భవన్ పాలన కొనసాగడం విడ్డూరంగా ఉందన్నారు. పేదల భూములు దోచి పెద్దలకు అప్పగించడం సరికాదన్నారు. పరిశ్రమల ముసుగులో ప్రభుత్వం భూముల అక్రమ దందా చేస్తోందని, నిమ్జ్ భూసేకరణను ఆపాలని డిమాండ్ చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలు ఏమయ్యా యని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎత్తిపోతల కంటే 10 వేల ఎకరాలు నీట మునగడం బాధాకరమన్నారు. సింగరేణి, ఎన్టీపీసీ కాలుష్యం, బూడిదతో నీళ్లు కలుషితం కావడంతో ఆ ప్రాంత ప్రజలు కిడ్నీ, ఉదరకోశ వ్యాధులతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు అప్పగించడం సరికాదన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో పరాయివాళ్లమయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం మందకృష్ణ మాదిగ, ప్రొఫెసర్ హరగోపాల్‌తో కలిసి కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు చెప్పారు. -
‘సమస్యల కంటే రాజకీయం ముఖ్యం కాదు’
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల సమ్మె ఏడో రోజు విజయవంతంగా సాగుతోందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి తెలిపారు. శుక్రవారం అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులను కలుస్తున్నామని, బీజేపీ అధ్యక్షుడు కె. లక్ష్మణ్‌ను కలిసి మద్దతు అడిగినట్లు వెల్లడించారు. ఆర్టీసీ బతికితేనే ప్రజా రవాణా అందరికి అందుబాటులో ఉంటుందని, ఉపాధ్యాయ సంఘాలు, రిటైర్డ్ ఉద్యోగులు తమకు మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు. శనివారం జరగబోయే మౌన దీక్షలో కార్మిక సంఘాల కుటుంబాలు సైతం పాల్గొంటాయని అన్నారు. పబ్లిక్ సెక్టార్, ప్రైవేటు సెక్టార్, విద్యుత్ సెక్టార్ల నుంచి మద్దతు కూడగడతామని, అన్ని ప్రభుత్వ సంఘాలు తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. రూ. 60, 70 వేల కోట్ల ఆర్టీసీ ఆస్తులను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టీజేఎస్ పార్టీ అధినేత కోదండరాం మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తో తన భేటీకీ ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికుల పక్షాన నిలవడానికి తాను బీజేపీ కార్యాలయానికి వచ్చానని తెలిపారు. కార్మికుల ఉద్యమానికి అన్ని పార్టీలు పూర్తి స్థాయి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని, దీనికి రాజకీయ పార్టీలు తోడైతే ప్రభుత్వం దిగివస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యల కంటే రాజకీయం ముఖ్యం కాదని కోదండరాం పేర్కొన్నారు. . దీనికి లక్ష్మణ్ పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తామని చెప్పారన్నారు. -
అవమానాలే తప్ప.. ఆత్మగౌరవం లేదు
సాక్షి, హైదరాబాద్: ఆత్మగౌరవం కోసం జరిగిన పోరాటాలతో సాధించుకున్న తెలంగాణలో నిరంకుశపాలన సాగుతోందని, ఇక్కడ అవమానాలకే తప్ప ఆత్మగౌరవానికి తావు లేదని తెలంగాణ జనసమితి (టీజేఎస్) అధినేత ప్రొఫెసర్ ఎం.కోదండరాం వ్యాఖ్యానించారు. ప్రశ్నించడమనే ప్రాథమిక హక్కునే టీఆర్ఎస్ ప్రభుత్వం కాలరాస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు దూరంగా, నియంతృత్వ చట్రంలో సీఎం కేసీఆర్ పరిపాలిస్తున్నాడని, ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదమని హెచ్చరించారు. పరిపాలనలో ప్రభుత్వ మంచి, చెడులను చర్చించుకోవడానికి అవకాశం ఉండాలని అభిప్రాయపడ్డారు. ఒత్తిడి పెంచడం, ప్రశ్నించడం ద్వారా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను సాధించుకునే అవకాశం లేకపోవడంతోనే టీజేఎస్ పుట్టుక అనివార్యమైందని, ఉద్యమ ఆకాంక్షల సాధన, ప్రజాస్వామిక పాలనే తమ అంతిమ లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, టీఆర్ఎస్ వైఫల్యాలు, ప్రత్యామ్నాయ మార్గాలు, ఐక్య ఫ్రంట్‌కు సంబంధించిన అంశాలపై ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలివీ! సాక్షి: ముందస్తు ఫలితాలు ఎలా ఉంటాయని విశ్లేషిస్తున్నారు? కోదండరాం: తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని టీఆర్ఎస్కు ఐదేళ్ల పాటు ప్రజలు అధికారాన్ని ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన మరునాటి నుంచే ఉద్యమ ఆకాంక్షలను సీఎంగా కేసీఆర్ పూర్తిగా విస్మరించారు. టీఆర్ఎస్ను ఫక్తు రాజకీయ పార్టీగా ప్రకటించి, రాజకీయ ప్రయోజనాలకే పాలనను పరిమితం చేశారు. ఉద్యమకారులను అన్నిరంగాల్లో అవమానించారు. ఉద్యమాలు చేస్తున్నవారిని కట్టెలతో కొట్టినవారికే ఇప్పుడు అధికార దండాన్ని అప్పగించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఎన్నో హామీలను అమలు చేయలేదు. హామీలను అమలు చేయలేని అసమర్థతను కప్పిపుచ్చుకుని, రాజకీయాల్లో వేడిని పుట్టించడం ద్వారా ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేసీఆర్ ముందస్తు ఎత్తు వేశారు. సహజంగానే రాజకీయ చైతన్యం ఉన్న తెలంగాణ ఉద్యమం ద్వారా ప్రజలకు ప్రశ్నించే చైతన్యం వచ్చింది. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు, యువకులు అవగాహన చేసుకున్నారు. హామీలను అమలు చేయకుండానే అసెంబ్లీని ఎందుకు రద్దు చేశారని ప్రశ్నిస్తున్నారు. ముందస్తు అవసరమేంటని ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం చెప్పలేకపోతున్నారు. ముందస్తు ఎన్నికలతో మరోసారి అధికారంలోకి రావాలనే కేసీఆర్ తపనను అన్ని స్థాయిల్లో ప్రశ్నిస్తున్నారు. ముందస్తుతో టీఆర్ఎస్కు, కేసీఆర్‌కు నష్టమే ఎక్కువ. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ముందస్తు ఎత్తుగడతో టీఆర్ఎస్ మునిగిపోక తప్పదు. టీఆర్ఎస్ ఏయే రంగాల్లో వైఫల్యం చెందింది? నీళ్లు, నిధులు, నియామకాలతో పాటు ఆత్మగౌరవం కోసం తెలంగాణలోని సబ్బండ వర్ణాలు ఏకమై పోరాడినయి. ఇప్పటిదాకా ఒక్క ప్రాజెక్టునూ పూర్తిచేయలేదు. అదనంగా ఒక్క ఎకరమూ నీటితో పారలేదు. ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగాలను భర్తీ చేయలేదు. ఉపాధికల్పనలోనూ టీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసింది. అవమానాలకు తప్ప ఆత్మగౌరవం అనే దానికి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అవకాశమే లేకుండా పోయింది. చట్టం, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం వంటి వాటికి గౌరవం లేదు. విచ్చలవిడిగా అధికారాన్ని ఉపయోగిస్తున్నారు. ఒక కుటుంబం చుట్టే పరిపాలన, అధికారం అంతా కేంద్రీకృతమైంది. వనరులన్నీ ఒక కుటుంబమే కొల్లగొడుతోంది. అన్నింటికన్నా ముఖ్యంగా ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సంబంధాలు తెగిపోయాయి. ప్రజల పట్ల బాధ్యత లేకుండా పాలన ఉంది. ఒక కుటుంబ అవసరాలు, ప్రయోజనాలకే ప్రభుత్వం, పాలనా యంత్రాంగ పరిమితమైంది. కేసీఆర్ కుటుంబ ప్రయోజనాలు తప్ప ప్రజల పట్ల బాధ్యతలేకుండా పాలన కొనసాగింది. టీఆర్ఎస్ పాలనపై విమర్శలు చేస్తున్నారు కదా..! మీరు సూచిస్తున్న ప్రత్యామ్నాయ అభివృద్ధి ప్రతిపాదనలేమిటి? ఉపాధికల్పన కీలకమైన అంశం. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాకపోయినా ఉపాధి, ప్రతి చేతికీ పని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఖాళీగా ఉన్న ప్రభుత్వ, ప్రభుత్వరంగ ఉద్యోగాలను సత్వరమే భర్తీ చేస్తాం. దీనికోసం ఉద్యోగాల భర్తీకి కేలండర్‌ను విడుదల చేస్తాం. వ్యవసాయ, ఆ రంగ ఆధారిత సెక్టార్లో ఉపాధి అవకాశాలను పెంచాలి. ఆధారపడిన దగిన ఆదాయం పొందడానికి అవసరమైన నైపుణ్య శిక్షణ అందాలి. చిన్న, సూక్ష్మ పారిశ్రామిక రంగం ద్వారా విస్తృతంగా ఉపాధి అవకాశాలు పెంచాలి. పరిశ్రమల్లో స్థానికులకు అవకాశం ఇవ్వాలి. దైనందిన జీవితానికి ఉపయోగపడే రంగాల్లో నైపుణ్యం పెంచడానికి సుశిక్షితులను చేయాలి. విద్య, వైద్యరంగాల్లో మౌలిక వసతులను పెంచడమే కాకుండా పేదలకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం బాధ్యత వహించాలి. ప్రభుత్వ సొమ్ము అన్నివర్గాలకు, ప్రధానంగా అట్టడుగు వర్గాలకు అందాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్‌ప్లాన్ పటిష్టంగా అమలుచేయాలి. వ్యవసాయ రంగంలో రైతులకు లాభదాయకమైన మార్గాలను అమలుచేయాలి. వీటిపై సీఎం కేసీఆర్‌కు చెప్పాలని ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్‌తో సన్నిహితంగా ఉండేవారు. మీ ఇద్దరికి వైరం ఎలా ఏర్పడింది? తెలంగాణ కోసం జేఏసీ నిర్వహించిన మిలియన్ మార్చ్, సాగరహారం వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలతో పాటు అనుసరించాల్సిన వ్యూహాలపైనా భిన్నాభిప్రాయాలు వచ్చాయి. ఉద్యమ కాలంలోనూ అంతర్గత చర్చలు, విబేధాలున్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా ప్రజాసంఘాలు, ఉద్యోగసంఘాలు, సామాజిక సంఘాలు జేఏసీలో భాగంగా పనిచేశాయి. రాజకీయ పార్టీలు కూడా జేఏసీ ఉన్నాయి.. రాష్ట్రం సాధించాలనే తపనలో కొన్నిసార్లు చాలా ప్రమాదకరమైన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి వచ్చింది. మిలియన్ మార్చ్, సాగరహారం, సకల జనుల సమ్మె వంటి భారీ కార్యక్రమాల సందర్భంలోనూ చర్చలు, భిన్నాభిప్రాయాలు తలెత్తాయి, తెలంగాణ ఏర్పాటై, టీఆర్ఎస్ ఫక్తు రాజకీయ పార్టీగా మారి, కేసీఆర్ సీఎం అయిన తర్వాత అసహనం పెరిగింది. ప్రశ్నించే తత్వాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేనని తన చేతల ద్వారా చూపించారు. ఉద్యమ ఆకాంక్షలు, ప్రజల కోసం విజ్ఞప్తులు, ఒత్తిళ్లు, పోరాట కార్యాచరణ చేపట్టాల్సి వచ్చింది. కేసీఆర్ నిరంకుశ, అప్రజాస్వామిక ధోరణి, ప్రజాస్వామిక హక్కులను అణిచేయాలనే వైఖరే వైరానికి కారణం. ప్రజాస్వామ్య గొంతును నొక్కాలని కేసీఆర్ ప్రయత్నం, ప్రతిఘటించే పోరాటంతో వైరం పెరిగినట్టుంది. ఇవి తప్ప వ్యక్తిగత అంశాలేమీ లేవు. టీఆర్ఎస్ ముఖ్యులెవరైనా మాట్లాడుతున్నారా? టీఆర్ఎస్ ముఖ్యులే కాకుండా అధిపత్యం కోసం కేసీఆర్ కుటుంబ సభ్యుల మధ్య అంతర్గత పోరు నడుస్తోంది. వీటి ప్రభావం పార్టీలో తీవ్రంగా ఉంది. నిరంకుశ చర్యలతో ఆ పార్టీలోని ముఖ్యులు మాట్లాడుతున్నారు. ఆ చర్చలు వివిధ స్థాయిల్లో ఉన్నాయి. ఉద్యమంలో జేఏసీకి, ఇప్పుడొక రాజకీయ పార్టీకి (టీజేఎస్‌కు) నేతృత్వం వహించడంలో తేడా ఏంటి? ఉద్యమంలో తెలంగాణ సాధన ఒక్కటే తక్షణావసరం.. అదే అంతిమ లక్ష్యం. రాజకీయ పార్టీకి రాజకీయ అవసరాలుంటాయి. రాజకీయ పార్టీ లక్ష్యాలు, యంత్రాంగం, ప్రాతిపదిక వంటి ఎన్నో అంశాలు వీటిలో అంతర్భాగం. ఇదొక కఠినమైన పరిధి. అయినా సాధించుకుంటాం. ఒంటరిగా వెళ్లడానికి టీజేఎస్ ఎందుకు వెనుకాడుతోంది? అదేమీ లేదు. తెలంగాణ రాష్ట్ర సాధన ఆకాంక్షలు, టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు తెలంగాణలో అమలు కాలేదు. కేసీఆర్ నిరంకుశ, అప్రజాస్వామిక పాలనతో విసిగిపోయిన క్షేత్రస్థాయి ప్రజలే అన్నిపార్టీలు ఏకమై ఫ్రంటు కావాలని కోరుతున్నరు. రాజకీయ ప్రయోజనాలు, సీట్లు మాత్రమే కాకుండా ఉద్యమ ఆకాంక్షల సాధన ప్రాతిపదికగా, ప్రజల ఎజెండాను మేనిఫెస్టోగా చేసుకోవాలని అన్నివర్గాలు ఒత్తిడి తెస్తున్నాయి. టీఆర్ఎస్ లాంటి నియంతృత్వ పార్టీ అధికారంలోకి వస్తే భవిష్యత్తులో ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడుతుందని ఆందోళనతోనే ఒత్తిళ్లు వస్తున్నాయి. దీనికి అనుగుణంగానే ఉమ్మడి మేనిఫెస్టోపై కాంగ్రెస్, సీపీఐ, టీడీపీ, టీజేఎస్‌లు అంగీకారానికి వచ్చాయి. ఉమ్మడి మేనిఫెస్టోను రూపొందించడం, దాని అమలు కోసం యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం, దానికి చట్టబద్దత కల్పించడం వంటి వాటికి అన్ని పార్టీలు అంగీకరించాయి. ఈ ఫ్రంట్ మేనిఫెస్టోను త్వరలోనే ప్రకటిస్తాం. టీడీపీ వంటి తెలంగాణ వ్యతిరేక పార్టీలతో ఉద్యమ ఆకాంక్షలు ఎలా సాధిస్తారు? పార్టీల సొంత ఎజెండాలు ఏమైనా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలే ఏకైక ప్రాతిపదికగా ఈ ఫ్రంట్‌లో భాగస్వామిగా ఉంది. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు, ప్రజల ఎజెండా మాత్రమే టీజేఎస్‌కు ప్రాతిపదిక. వీటికి మించి మాకు ఏవీ ముఖ్యం కాదు. ఈ ఫ్రంట్‌లో భాగస్వామిగా టీజేఎస్ ఉంటుంది తప్ప ఏ పార్టీలో చేరడం లేదు. ప్రజల ఎజెండా అమల్లో చిన్న లోపం జరిగినా టీజేఎస్ అంగీకరించదు. ఉమ్మడి మేనిఫెస్టో అమలుకు అన్ని పార్టీలు అంగీకరించాకే మిగిలిన ఏ అంశమైనా చర్చకు వస్తుంది. ఈ ఫ్రంట్‌లో ఏ పార్టీ ఎన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీచేస్తుంది? ఇంకా సీట్లపై చర్చ జరగలేదు. ప్రజల ఎజెండా, ఉద్యమ ఆకాంక్షలతో కూడిన మేనిఫెస్టోపై కసరత్తు పూర్తి కావస్తోంది. ప్రజల ఎజెండాయే ఈ ఫ్రంట్ ఏర్పాటుకు ప్రాతిపదిక. సీట్లు, పోటీ వంటివి భాగం మాత్రమే. ఈ ఫ్రంట్‌లో పెద్ద భాగస్వామి అయిన కాంగ్రెసే అన్ని అంశాలపై సరైన నిర్ణయాలు తీసుకుని, ఫ్రంట్‌ను నిలబెట్టడానికి బాధ్యత వహించాలి. చొరవ తీసుకుని, వేగంగా నిర్ణయాలు తీసుకోవాలి. ప్రజల్లోని అన్ని వర్గాల సమష్టి ప్రయోజనాల కోసం టీజేఎస్ పనిచేస్తుంది. మీరు ఎక్కడి నుంచి పోటీచేస్తారు? నా పోటీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పోటీచేయాలని ఐదారు నియోజకవర్గాల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. విశాల ప్రయోజనాల కోసం పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. పోటీచేయాలా.. వద్దా.. ఎక్కడ్నుంచి పోటీ చేయాలనే దానిపై పార్టీదే తుది నిర్ణయం. వ్యక్తిగత నిర్ణయాలకు తావు లేదు. పార్టీకి, ఫ్రంట్‌కు ఏది లాభమో, అ నిర్ణయమే తీసుకుంటుంది. -
హస్తం గుర్తేనా..!
-
కూటమి పొత్తుల్లో కొసమెరుపు!
సాక్షి, హైదరాబాద్: ముందస్తు ఎన్నికల్లో ప్రతి ఒక్క సీటును జాగ్రత్తగా అంచనా వేస్తున్న కాంగ్రెస్.. ఈ దిశగా మహాకూటమి పొత్తుల్లో కొత్త ట్విస్ట్ తీసుకొచ్చింది. పొత్తుల్లో భాగంగా తెలంగాణ జనసమితికి ఇచ్చే సీట్ల విషయంలో వినూత్న ప్రతిపాదన చేసింది. టీజేఎస్ అభ్యర్థులు తమ పార్టీ గుర్తు (ఇంకా రావాల్సి ఉంది)తో ఎన్నికలకు వెళ్తే ఇబ్బంది అవుతుం దని అందువల్ల.. వీరిని కాంగ్రెస్ బీఫారంపైనే పోటీ చేయించాలని ప్రతిపాదించింది. ఇందుకోసం ఆ పార్టీ కోరుకుంటున్న స్థానాలు ఇచ్చేందుకు కాస్త.. అటు, ఇటుగానైనా అంగీకారం తెలపాలని ఆదివారం గోల్కొండ హోటల్లో జరిగిన పార్టీ కోర్‌కమిటీ భేటీలో నిర్ణయించారు. ఈ ప్రతిపాదనపై టీజేఎస్‌ను ఒప్పించడంతోపాటు.. కూటమిలోని మిగిలిన పార్టీల మధ్య పొత్తు సమన్వయం చేసే బాధ్యతలను సీనియర్ నేత జానారెడ్డికి అప్పగించారు. ఈ సమావేశంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియాతో పాటు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పార్టీ సీనియర్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ, మధుయాష్కీ గౌడ్, రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, చిన్నారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, సలీం అహ్మద్, శ్రీనివాస కృష్ణన్లు పాల్గొన్నారు. సమావేశంలో కూటమిలో సీట్ల సర్దుబాటు, ఈనెల 20న రాహుల్ గాంధీ పర్యటన ఏర్పాట్లపై చర్చించారు. కూటమి పార్టీలకు కాంగ్రెస్ ఇచ్చేందుకు సుముఖంగా ఉన్న స్థానాలు తెలుగుదేశం పార్టీకి.. 10-12 టీజేఎస్‌కు.. 8-10 సీపీఐకి.. 2 కోదండకు డిప్యూటీ సీఎం హోదా సీట్ల సర్దుబాట్లపై జరిగిన చర్చలో టీడీపీకి 10–12 స్థానాలు, టీజేఎస్‌కు 8–10 స్థానాలు, సీపీఐకి 2 స్థానాలు ఇవ్వడానికి కాంగ్రెస్ నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు. అయితే, టీజేఎస్ అభ్యర్థులను ఎలా సర్దుబాటు చేయాలన్న దానిపైనే సమావేశంలో తీవ్ర చర్చ జరిగింది. ఆ పార్టీ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం గౌరవానికి భంగం కలిగించకుండా.. టీజేఎస్ కోరుకుంటున్నట్లుగా.. 8–10 సీట్లు ఇవ్వాలనే అభిప్రాయానికి వచ్చారు. టీజేఎస్‌కు ఇచ్చే సీట్లలో పోటీచేసే నేతలకు కాంగ్రెస్ బీఫారం ఇచ్చి హస్తం గుర్తుపైనే బరిలో దించాలని నిర్ణయించారు. ఇలాగైతేనే.. కూటమికి మేలు జరుగుతుందని, టీజేఎస్ గుర్తు మీద పోటీ చేయడం ఇబ్బందికరంగానే ఉంటుందనే అభిప్రాయం వెల్లడించారు. అయితే, ఆ పార్టీ కోరుతున్న విధంగా కూటమి కనీస ఉమ్మడి ప్రణాళిక (సీఎంపీ) అమలు చైర్మన్‌గా కోదండరాంను నియమించాలని, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కమిటీకి చట్టబద్ధత కల్పించి కమిటీ చైర్మన్‌కు డిప్యూటీ సీఎం హోదా కల్పించాలని భేటీలో నిర్ణయించారు. ఈ ప్రతిపాదనలను టీజేఎస్ నేతల ముందుపెట్టి వీలున్నంత త్వరగా పొత్తుల వ్యవహారం తేల్చాలనుకుంటున్నారు. కోదండరాంను పోటీ చేయించడం కన్నా.. ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేసే బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. కోదండరాం పర్యటనల కోసం అవసరమైతే ప్రత్యేక హెలికాప్టర్ సమకూర్చాలని, ఆయన పోటీలో ఉన్నదాని కన్నా ప్రచారంలో కీలకంగా ఉండడమే కూటమికి మేలు చేస్తుందని కోర్‌కమిటీ సమావేశంలో అభిప్రాయానికి వచ్చారు. ‘జానా అండ్ కో’బాధ్యతలు కూటమి పార్టీలను సమన్వయపరిచి వీలున్నంత త్వరగా పొత్తుల వ్యవహారం తేల్చే బాధ్యతను పార్టీ సీనియర్ నేత జానారెడ్డి బృందానికి అప్పగిస్తూ కోర్‌కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీలో చిన్నారెడ్డి, పొన్నం ప్రభాకర్, పి.వినయ్‌కుమార్‌లను సభ్యులుగా ఉంచాలని, ఈ నలుగురి బృందం ఇతర పార్టీలతో పొత్తుల చర్చల్లో పాల్గొనాలని, మిగిలిన పార్టీ నేతలు ఇతర కార్యక్రమాలు చూసుకోవాలని నిర్ణయించారు. టీజేఎస్ నేతలతో భేటీ కోర్‌కమిటీ సమావేశం ముగిసిన వెంటనే జానారెడ్డి తన నివాసంలో టీజేఎస్ ముఖ్య నేతలు దిలీప్ కుమార్, రచనా రెడ్డిలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కోర్‌కమిటీ ప్రతిపాదనలను జానారెడ్డి టీజేఎస్ నేతల ముందుంచారు. అయితే.. ఈ ప్రతిపాదనలపై పార్టీ అధినేత కోదండరాంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని నేతలు వెల్లడించారు. సమావేశం అనంతరం దిలీప్ కుమార్, రచనా రెడ్డిలు మీడియాతో మాట్లాడుతూ సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్‌తో చర్చించినట్టు తెలిపారు. తమ పార్టీ తరఫున పోటీచేయాలనుకుంటున్న 36 మంది జాబితాను కాంగ్రెస్‌కు ఇచ్చామని, ఎంతమందికి సీట్లు ఇస్తారన్నది ఇంకా నిర్ణయించలేదని చెప్పారు. సీట్ల సర్దుబాటు పెద్ద సమస్య కాదని, ఈ విషయంలో టీజేఎస్ అసంతృప్తితో ఉందన్నది అవాస్తవమన్నారు. పొత్తులు, సీట్ల సర్దుబాటు ఒకట్రెండు రోజుల్లో కొలిక్కి వస్తాయని వెల్లడించారు. కాంగ్రెస్ గూటికి రాములు నాయక్? టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆదివారం హోటల్ గోల్కొండకు వచ్చారు. కాంగ్రెస్ కోర్‌కమిటీ సమావేశం జరుగుతున్న సమయంలోనే హోటల్‌కు వచ్చిన ఆయన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, ఇతర నేతలను కలిశారు. కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని.. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లెందు అసెంబ్లీ నుంచి పోటీ చేసే అవకాశం కల్పించాలని ఆయన కోరినట్టు సమాచారం. అయితే, దీనిపై పార్టీ హైకమాండ్‌తో చర్చించి సమాచారం ఇస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పినట్లు గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. కొడంగల్‌లో రాహుల్ సభ? ఈనెల 20న రాహుల్ పర్యటన ఏర్పాట్లపై కూడా కాంగ్రెస్ కోర్‌కమిటీ చర్చించింది. భైంసా, కామారెడ్డిలతో పాటు హైదరాబాద్ పాతబస్తీలో జరిగే రాహుల్ పర్యటనను విజయవంతం చేయాలని, పెద్ద ఎత్తున జనసమీకరణ చేయాలని నిర్ణయించారు. అదే విధంగా ఈనెల 27న మరోమారు రాహుల్ రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా ఎక్కడ సభలు పెట్టాలన్న దానిపై కూడా చర్చించారు. వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో సభలు నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో కూడా రాహుల్ సభ ఏర్పాటు చేయించాలన్నదానిపై చర్చ జరిగింది. కొడంగల్‌లో రాహుల్ సభ జరిగితే.. దక్షిణ తెలంగాణలో కూడా ప్రభావం ఉంటుందన్న కోణంలో చర్చ జరిగినప్పటికీ దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదు. -
‘మహాకూటమితో రాజకీయాల్లో మార్పులు’
సాక్షి, హైదరాబాద్: మహాకూటమి తెలంగాణలో రాజకీయ వాతావరణాన్ని మార్చివేసిందని టీజేఎస్ చైర్మన్ కోదండరాం అన్నారు. పొత్తును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. శనివారం టీజేఎస్ పార్టీ కార్యాలయంలో ఎన్ఐఏ కోర్టు రిటైర్డు జడ్జి రవీందర్‌రెడ్డి టీజేఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ రాష్ట్రంలో మహాకూటమి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఏర్పాటు ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. నిరుద్యోగులు, ఉద్యోగులతో పాటు అన్ని వర్గాలు మహాకూటమికి మద్దతుగా ఉన్నాయన్నారు. సీట్ల సర్దుబాటుపై చర్చలు వేగవంతమయ్యాయని, సీట్లపై ఇవాళో, రేపో స్పష్టత వస్తుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. దసరా నుంచి ప్రచారం ప్రారంభించాలనుకుంటున్నామన్నారు. జడ్జి రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ ఒక్కరు ఉద్యమిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాలేదని, సుమారు 1,600 మంది ఉద్యమంలో అమరులయ్యారన్నారు. -
ఉద్యమస్ఫూర్తికి ఏదీ గౌరవం?
అధికారంలోనున్న నాయకులకు తమ ప్రయోజనాలే కానీ మన అవసరాలు కనిపించడం లేదు. ఇప్పుడు రాష్ట్రంలో పాలన పాతకాలపు జాగీర్దార్ల పాలనను తలపిస్తున్నది. మనం కోరుకున్న ప్రజాస్వామిక పాలన కాదిది. ప్రజలకు నిర్ణయాధికారం లేదు. జాగీర్దార్లు అధికారాన్ని తమ ఇష్టానుసారం చెలాయించేవారు. ఇప్పటి పాలకులు కూడా అదే పద్ధతిలో సాగుతున్నారు. ప్రభుత్వానికి కనీసం తమ గోడు చెప్పుకోవడానికి కూడా ప్రజలకు మార్గమే లేదు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఏ పని చెప్పినా కాదు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, తరువాత రాష్ట్ర ఏర్పాటు చరిత్రాత్మక ఘట నలు. సకల జనులు కలసి, సబ్బండ వర్గాలు ఏకమై సుదీర్ఘ కాలం పోరాడారు. ఉద్యమాల ఫలితంగా, త్యాగాల కారణంగా ఆవిర్భవించిన తెలంగాణలో ఇప్పుడు ప్రజల ఆకాంక్షలకు గౌరవం లేకుండా పోవడమే పెద్ద విషాదం. ఈ అంశాన్ని వెల్లడించమే అమరవీరుల స్ఫూర్తి యాత్ర ఉద్దేశం. గోచికట్టి గొంగడేసుకుని పాట పాడి, వంటా వార్పూ చేసి, రాస్తారోకోలలో పాల్గొని, రైలు పట్టాల మీద బైఠాయించి, బంద్‌లు పాటించి, సమ్మెలు చేసి, సత్యాగ్రహాలు నిర్వహించి తెలంగాణ ప్రజలు తమ ప్రత్యేక రాష్ట్ర కలను నిజం చేసుకున్నారు. ఆంధ్ర పాలకులతో తెగించి కొట్లాడినారు. ఉద్యమానికి ఊతమిచ్చి తిరిగిరాని లోకాలకు తరలిపోయిన వారు ఎందరో. తరువాత ఎన్నికలలో తెలంగాణవాదుల గెలుపుకోసం రకరకాల మార్గాలలో ప్రచారాలు చేసి, నేను సైతం అన్న తీరులో ప్రతి వ్యక్తి సమరశీలతతో కదం తొక్కారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సంకుచితమైనది కాదు. ఆంధ్రా పాలకులను వ్యక్తిగతంగా వ్యతిరేకించడానికి ఇది సాగలేదు. అసలు ఆంధ్రపాలకులను ద్వేషించడమే దాని ధ్యేయం కాదు. తెలంగాణ అభివృద్ధికి ఆటంకంగా నిలిచిన ఆంధ్ర పాలకుల పెత్తనాన్ని మాత్రమే ఉద్యమం ఎదిరించింది. ‘సచి వాలయంలో కూర్చుని చక్రం తిప్పడం కుదరదు’ అని రాష్ట్ర సాధనోద్యమం తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా భారత స్వాతంత్య్రోద్యమం గురించి కాళోజీ నారాయణరావు చేసిన వ్యాఖలను గుర్తు చేసుకోవాలి. ‘మాకొద్దీ తెల్లదొరతనము...’ అన్న గరిమెళ్ల వారి గేయంలోని మాటలను ఉటంకిస్తూ కాళోజీ, ‘స్వాతంత్య్రోద్యమం తెల్లవారిని వెళ్లగొట్టడం కోసమే కాదు, దొరతనాన్ని కూడా అంతం చేయడానికి సాగింది’అని పేర్కొనేవారు. సామాజిక, ఆర్థిక రంగాల మీద గుప్పెడు మంది పెత్తనాన్ని కూలదోయాలని తెలంగాణ ఉద్యమం అనుకున్నది. ఉద్యమ ఆకాంక్షలు సమష్టి అధికారాన్ని సమష్టి ప్రయోజనాలకు ఉపయోగించడానికి బదులుగా సీమాంధ్ర పాలకులు కార్పొరేట్ శక్తులకూ, కాంట్రాక్టర్లకూ, రియల్ ఎస్టేట్ డీలర్లకూ మేలు కలిగించే రీతిలో వ్యవహరించారు. అందువల్లనే ప్రజలు, ప్రధానంగా రైతులు, కార్మికులు, కుటీర పరిశ్రమలకు చెందినవారు, చిరువ్యాపారులు బాగా నష్టపోయారు. ఇజ్జత్‌తో బతకగలమన్న విశ్వాసం అడుగంటి పోవడంతో 1990 దశకం నుంచి రైతులు, చేతివృత్తుల వారు అనేక మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే వనరులలో వాటా, అ«ధికారంలో భాగం దక్కుతుందని తెలంగాణ ప్రజానీకం ఆశించింది. అభివృద్ధి నమూనా మారిపోయి బతుకు తెరువు అవకాశాలు పెరుతాయని, అందివస్తాయని భావించింది. ఉద్యోగాలు దొరుకుతాయని యువతీయువకులు బలంగా విశ్వసించారు. అసలు సమష్టి జీవితాన్ని ప్రజాస్వామిక పద్ధతిలో నిర్వహించుకోవాలన్న ఆశయంతోనే ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్నారు. కానీ ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగడం లేదు. ఆంధ్ర పాలకుల వలెనే ప్రస్తుత ప్రభుత్వం కూడా ప్రజలనూ, వారి ఆకాంక్షలనూ పక్కన పెట్టింది. ఆంధ్ర కాంట్రాక్టర్లకు, కార్పొరేట్ శక్తులకు పట్టం కట్టింది. చిల్లరపైసలు ఇక్కడి ప్రజల ముఖాన కొట్టి గొప్ప ఘనకార్యమేదో చేసినట్టు పేజీలకు పేజీలు పత్రికలలో ప్రకటనలు ఇస్తున్నారు. ప్రజా ప్రయోజన పథకాల మీద వెచ్చించిన దానికంటే, ఆ ప్రకటనలకే ఎక్కువ ఖర్చయిందేమో కూడా! మిషన్ భగీరథ పేరుతో, ప్రాజెక్టుల పేరుతో కోట్ల రూపాయలు ఆంధ్ర పాలకుల జేబులలోనికే వెళ్లాయి. ఉద్యోగాల ఊసే లేదు నీళ్లు, నిధులు, నియామకాలు... ఈ నినాదాలే తెలంగాణ ఉద్యమానికి ట్యాగ్‌లైన్. ఇందులో నియామకాల నినాదానికి ఆకర్షితులు కావడం వల్లనే యువతీ యువకులు ఉద్యమంలో విస్తృతంగా పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పడితే తమ వారికి ఉద్యోగాలు దొరుకుతాయని ఉద్యమం కోసం ఆత్మార్పణం చేసుకున్నవారు రాసిపెట్టిన నోట్లలో పేర్కొన్నారు కూడా. కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగింది వేరు. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలలో సుమారు రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కానీ ఇప్పటికి 20,000 ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేదు. ఉద్యోగ భర్తీ ప్రకటనలు వెలువడతాయన్న ఆశతో అభ్యర్థులు వేలాది రూపాయలు ఖర్చు చేస్తూ కోచింగ్ క్లాసులకు హాజరవుతున్నారు. కానీ పోస్టులు మాత్రం అందని ద్రాక్షలుగానే మిగిలిపోతున్నాయి. జరిగిన పరీక్షలైనా అస్తవ్యస్తంగా జరిగాయి. పోటీ పరీక్షలను సక్రమంగా నిర్వహించడానికీ, ఉపాధి అవకాశాలు పెంచడానికీ ఇచ్చిన అన్ని సూచనలను కూడా ప్రభుత్వం బేఖాతరు చేసింది. ఉద్యోగాల భర్తీకి క్యాలండర్‌ను ప్రకటించాలని, ప్రైవేట్ సంస్థలలో భూమిపుత్రులకు రిజర్వేషన్లు పాటించాలని చేసిన కీలక విజ్ఞాపనలు ప్రభుత్వం చెవికెక్కలేదు. ఉపాధి అవకాశాల కల్పనకు ప్రణాళికలు తయారు చేయాలన్న సూచనలను కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. సమాన పనికి సమాన వేతనం అన్న సూత్రం ప్రకారం కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను పెంచే విషయంలో ఇప్పటి వరకు ప్రభుత్వంలో కదలిక లేదు. సంక్షోభంలో వ్యవసాయం ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత కూడా రైతుల బలవన్మరణాలు ఆగలేదు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 2,900 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఈ మూడేళ్లలో పంటల ధరలు పడిపోవడంతో పెట్టిన పెట్టుబడులు రాక సుమారు రూ. 500 కోట్లు తాము నష్టపోవడం జరిగిందని రైతు సంఘాలు చెబుతున్నాయి. కరువు నష్టానికి పరిహారం, ఇన్పుట్ సబ్సిడీ రైతులకు ముట్టలేదు. కనీసం కేంద్రం ఇచ్చిన రూ. 800 కోట్ల పరిహారం కూడా చేరలేదు. రైతులు ఏం పంట వేసుకోవాలో చెప్పలేని దౌర్భాగ్యస్థితిలో ప్రభుత్వం ఉంది. ఈ సమస్యలకు పరిష్కారాలు ప్రభుత్వానికి తోచక పోవచ్చునని రైతు సంఘాలన్నీ కలసి వ్యవసాయ శాఖ కార్యదర్శికి వివరమైన, విలువైన సూచనలు ఇచ్చాయి. రైతు ఆదాయాన్ని పెంచటానికి సమగ్ర వ్యవసాయ విధానం రావాలన్నారు. రైతులను ఆదుకోవటానికి వ్యవసాయ కమిషన్ వేయాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు సాయం చేయాలన్నారు. బ్యాంకుల నుంచి రైతులకు కావలసిన అప్పులు ఇప్పించాలని, నకిలీ విత్తనాలు సరఫరా చేసే వ్యాపారులను కఠినంగా శిక్షించాలని, పంటల ధరలు పడిపోయినప్పుడు మద్దతు ధర చెల్లించి ఆదుకోవటానికి నిధిని ఏర్పాటు చేయాలని, చిన్న రైతులకు కావలసిన వ్యవసాయ పరికరాలను సబ్సిడీకి ఇవ్వాలని కోరినా ఉలుకూ పలుకూ లేదు. సంక్షేమ పథకాల అమలు–తీరుతెన్నులు ప్రజలకు అవసరమయ్యే ఏ పథకం కూడా అమలు కావడం లేదు. ఫీజు రీయింబర్సుమెంటు బకాయిలు చెల్లించక పోయేసరికి చాలామంది పిల్లలు చదువుకు దూరమయ్యారు. ఉద్యోగాలకు అర్హత కోల్పోయారు. సింగరేణిలో ఓపెన్ కాస్టు గనులను ఆపే ప్రయత్నం చేయలేదు. ప్రభుత్వ విద్యా సంస్థలు, ప్రభుత్వ ఆసుపత్రుల పునరుద్ధరణ జరగనే లేదు. ప్రైవేటు విద్యా సంస్థల ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు ఆవేదనకు గురవుతున్నారు. పేదలకు వైద్యం అందుబాటులో లేకుండా పోతున్నది. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు దారిమళ్లుతున్నాయి. చిన్న, సూక్ష్మ పరిశ్రమల పునరుద్ధరణకు ప్రయత్నమే లేదు. నిజాం షుగర్స్‌ను తెరిచి, నడిపిస్తామన్న హామీని మరిచి ఇవాళ పూర్తిగా మూసేశారు. నిర్వాసితుల కోసం 2013 భూసేకరణ చట్టం కల్పించిన మానవీయ పద్ధతులు రద్దయిపోయాయి. దాదాపు 3 లక్షల ఎకరాల భూమిని బలవంతంగా గుంజుకోవడానికి, నిర్వాసితుల హక్కుల రద్దు కోసం కొత్త చట్టాలను తీసుకొచ్చారు. ఇప్పటికే చాలా గ్రామాల్లో మంచినీటి నల్లాలు ఉన్నాయి. కానీ వాటిని తవ్వి మళ్లీ కొత్త పైపులు పరుస్తున్నారు. అదికూడా కాంట్రాక్టర్ల జేబులు నింపడానికే. అందుకైన వేల కోట్ల నిధుల దుర్వినియోగాన్ని ఆపగలిగితే డబుల్ బెడ్రూం ఇళ్ల పథకానికి కావలసినన్ని నిధులుండేవి. ఇప్పటివలెనే అమలైతే మూడెకరాల పథకం కింద భూమిలేని దళితులందరికీ భూమి పంచడానికి 230 సంవత్సరాలు పడుతుంది. సాగునీటి పథకాల ఖర్చు తగ్గించే లక్ష్యంతో డిజైన్ చేస్తే సంక్షేమ పథకాల అమలుకు నిధుల కొరతే ఉండదు. అది అట్లుండగా వార్తలకెక్కిన భూ కుంభకోణాలు అధికార దుర్వినియోగాన్ని స్పష్టం చేస్తున్నాయి. రాజకీయ నాయకులు, అధికారులు, రియల్ ఎస్టేట్ డీలర్లతో కుమ్మక్కై వేల ఎకరాలు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేశారు. అప్రజాస్వామిక వైఖరి అధికారంలోనున్న నాయకులకు తమ ప్రయోజనాలే కానీ మన అవసరాలు కనిపించడం లేదు. ఇప్పుడు రాష్ట్రంలో పాలన పాతకాలపు జాగీర్దార్ల పాలనను తలపిస్తున్నది. మనం కోరుకున్న ప్రజాస్వామిక పాలన కాదిది. ప్రజలకు నిర్ణయాధికారం లేదు. జాగీర్దార్లు అధికారాన్ని తమ ఇష్టానుసారం చెలాయించేవారు. ఇప్పటి పాలకులు కూడా అదే పద్ధతిలో సాగుతున్నారు. ప్రభుత్వానికి కనీసం తమ గోడు చెప్పుకోవడానికి కూడా ప్రజలకు మార్గమే లేదు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఏ పని చెప్పినా కాదు. ముఖ్యమంత్రి ఎవ్వరినీ కలువరు. గజేంద్రుడు వేడుకుంటే వైకుంఠపురిలోని విష్ణుమూర్తి దిగొచ్చాడు. కానీ ఎన్ని మొక్కినా మన ముఖ్యమంత్రి బయటకు రాడు. ప్రజలను కలువడు. తమ సమస్యలు నలుగురికీ వినిపించడానికి ఉన్న ఒక్క వేదిక ఇందిరా పార్కు వద్దనున్న ధర్ణాచౌకును కూడా మూసివేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ వార్త కూడా రాయవద్దని మీడియాపై జులుం చెలాయిస్తున్నారు. రాష్ట్రాన్ని తేవడానికి ప్రజలు చేసిన త్యాగాలకు, బలిదానాలకు ఇవాళ గుర్తింపు లేదు. విలాసాలు, హైదరాబాద్ చుట్టుప్రక్కల ఆస్తులు, కాంట్రాక్టుల పంపకాలు, ప్రచారాలు ఇదీ పాలకుల వ్యవహారం. దీన్ని ప్రజలకు తెలియజెప్పడానికే అమరవీరుల స్ఫూర్తి యాత్ర నిర్వహిస్తున్నాం. తెలంగాణ ఆకాంక్షలను పరిరక్షించడానికే మొదలుపెట్టినాం. ప్రజలు నిరాశ చెందవలసిన అవసరం లేదు. ఎంతోమంది నియంతల పాలనను అంతం చేసిన మనకు ప్రజాస్వామిక తెలంగాణను నిర్మించుకోవడం పెద్ద పని కాదు. - వ్యాసకర్త టీజేఏసీ ఛైర్మన్ యం. కోదండ రామ్ మొబైల్ : 98483 87001 -
ఆ టికెట్ ఎవరిదో?
మెదక్ ఉప ఎన్నికల బరిలో నిలిచేందుకు ఆశావాహులు సన్నాహాలు మొదలుపెట్టారు. ప్రధాన పార్టీల తరపున పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నవారు తమ తమ స్థాయిలో పైరవీలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో అన్ని పార్టీల్లో పలువురు పేర్లు తెరపైకి వస్తున్నాయి. వీరిలో ఉద్యోగ సంఘాలు, ఉద్యమ నాయకులు, కోటీశ్వరులు ఉండడం గమనార్హం. కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సముఖత వ్యక్తం చేశారు. తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ ను ఆయన కోరినట్టు తెలిసింది. అయితే టీఆర్ఎస్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంను నిలిపితే ఎలా ఉంటుందనే దానిపై కాంగ్రెస్ పార్టీ యోచనలు చేస్తోంది. ఒకవేళ పోటీకి కోదండరాం నిరాకరిస్తే కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డిని హస్తం పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ (టీఎన్జీఓస్) అధ్యక్షుడు జి. దేవీప్రసాదరావు ముందుకు వచ్చారు. సోనీ ట్రావెల్స్ అధినేత కే. ప్రభాకర్ రెడ్డి, మహిధర కన్స్ట్రక్షన్స్ ప్రమోటర్ ప్రశాంత్ రెడ్డి పేర్లు కూడా వినబడుతున్నాయి. మల్కాజ్‌గిరిలో పోటీ చేసి ఓడిపోయిన మైనంపల్లి హనుమంతరావు కూడా మెదక్ ఎంపీ సీటు ఆశిస్తున్నట్టు సమాచారం. కేసీఆర్ సింగపూర్ నుంచి వచ్చిన తర్వాత అభ్యర్థి ఎవరనేది తేలనుంది. ఇక ఎన్డీఏ అభ్యర్థిగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి పేరు వినబడుతోంది. ఎం రఘనందన్ కూడా ఆశావహుల లిస్టులో ఉన్నారు. సెప్టెంబర్ 13న జరగనున్న మెదక్ ఉప ఎన్నికలో ఎవరెవరు బరిలో ఉంటారనేది మరికొద్ది రోజుల్లో స్పష్టత వస్తుంది. -
తెలంగాణ కోసం సుష్మా స్వరాజ్ సాయం కోరిన జేఏసీ
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ త్వరితగతిన పూర్తయ్యేలా సహకరించాలని తెలంగాణ జేఏసీ నాయకులు బీజేపీ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్‌ను కోరారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయం అమలయ్యేలా బీజేపీ చొరవ చూపాలని ఆమెకు విజ్ఞప్తి చేసినట్టు జేఏసీ చైర్మన్ కోదండరామ్ ఆదివారం మీడియా సమావేశంలో తెలిపారు. తమ విన్నపానికి సుష్మా స్వరాజ్ సానుకూలంగా స్పందించారని ఆయన చెప్పారు. తెలంగాణను తొందరగా ఏర్పాటు చేయాలన్న వాదనతో ఆమె ఏకీభవించారని కోదండరామ్ తెలిపారు. ఈ విషయంతో తమ పార్టీ తరపున సాయం చేస్తామని సుష్మా హామీ ఇచ్చారని వెల్లడించారు. మహబూబ్ నగర్లో శనివారం జరిగిన తెలంగాణ ప్రజాగర్జన సదస్సుకు సుష్మా స్వరాజ్ ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. -
సెప్టెంబర్ 7న చలో హైదరాబాద్‌కు పిలుపు