ట్రాయ్‌ ఎఫెక్ట్‌: ఎయిర్‌టెల్‌, ఐడియా షేర్లు రయ్‌ | Telecom shares in focus; Bharti Airtel, Idea Cellular up 2% | Sakshi
Sakshi News home page

ట్రాయ్‌ ఎఫెక్ట్‌: ఎయిర్‌టెల్‌, ఐడియా షేర్లు రయ్‌

Published Fri, Apr 7 2017 11:21 AM | Last Updated on Sat, Aug 25 2018 4:14 PM

ట్రాయ్‌ ఎఫెక్ట్‌: ఎయిర్‌టెల్‌, ఐడియా షేర్లు రయ్‌ - Sakshi

ట్రాయ్‌ ఎఫెక్ట్‌: ఎయిర్‌టెల్‌, ఐడియా షేర్లు రయ్‌

ముంబై: ఉచిత ఆఫర్లతో సునామిలా దూసుకొచ్చిన రిలయన్స్‌ జియోకు టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్‌  అనూహ్యంగా చెక్‌ పెట్టడం దేశీయ టెలికాం ఆపరేటర్లకు బాగా కలిసి వచ్చింది. జియో తాజా సమ్మర్‌ సర్‌ప్రైజ్‌  ఉచిత ఆఫర్లను  నిలిపివేయాలంటూ ట్రాయ్‌ ఆ దేశించడంతో  ప్రత్యర్థి సంస్థలు వెలుగులోకి వచ్చాయి.  ముఖ్యంగా భారతి ఎయిర్‌ టెల్‌, ఐడియా తదితర  మేజర్‌ కంపెనీలు పండగ చేసుకుంటున్నాయి.   శుక్రవారం నాటిమార్కెట్లో మదుపర్లు టెలి కాం ఇండెక్స్‌ లో  కొనుగోళ్లవైపు మొగ్గు చూపారు. 

ఒకవైపు  దలాల్‌ స్ట్రీట్‌  నష్టాల​ పాలవుతుండగా  టెలికాం షేర్లు మాత్రం లాభాలనార్జించడం విశేషం.  భారతి ఎయిర్‌ టెల్‌  దాదాపు 3 శాతంపైగా జంప్‌చేసిటాప్‌ గెయినర్‌గా నిలిచింది.  ఇదే బాటలో ఐడియా సెల్యులర్‌ పయనిస్తూ 2 శాతానికిపైగా పుంజుకుంది. మరోవైపు  ఇటీవలి రికార్డ్‌స్తాయి లాభాలను పొందిన  రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 1 శాతానిపైగా  నష్టపోయింది.  

కాగా ఇటీవల టారిఫ్‌లలోకి  ఎంట్రీ ఇచ్చిన జియో తన ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ పథకంలో ఉచిత ఆఫర్‌ను  మూడు నెలలపాటు పొడిగిస్తున్నట్టు ప్రకటించి  ప్రత్యర్థి కంపెనీలపై  బాంబు వేసింది. అయితే జియో తాజా ఆఫర్‌ నిబంధనలకు  విరుద్ధంగా ఉందని, తక్షణమే నిలిపివేయాలని ట్రాయ్‌ ఆదేశించిన  సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement