'ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే 300 సీట్లు మావే' | that alliance to fetch 300 seats at UP | Sakshi
Sakshi News home page

'ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే 300 సీట్లు మావే'

Published Tue, Dec 13 2016 6:41 PM | Last Updated on Thu, Sep 19 2019 8:40 PM

'ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే 300 సీట్లు మావే' - Sakshi

'ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే 300 సీట్లు మావే'

లక్నో: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌ పార్టీ చేతులు కలిపే అవకాశముందని కథనాలు వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  అధికార ఎస్పీ, కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకుంటే తిరుగే ఉండదని, రానున్న ఎన్నికల్లో ఈ కూటమి 300కుపైగా స్థానాలు గెలువడం ఖాయమని ఆయన పేర్కొన్నారు.

'మేం సొంతంగా పోటీచేసినా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సాధిస్తాం. ఒకవేళ కూటమిగా వెళితే.. రాష్ట్రంలోని 403 అసెంబ్లీ స్థానాల్లో 300లకుపైగా సీట్లు గెలుపొందుతాం. ఈ విషయంలో తుది నిర్ణయం పార్టీ జాతీయ అధ్యక్షుడి (ములాయం సింగ్‌)దే' అని అఖిలేశ్‌ అన్నారు. కాంగ్రెస్‌ పొత్తుకు అవకాశముందా? అన్న విలేకరుల ప్రశ్నకు అఖిలేశ్‌ ఈ విధంగా బదులిచ్చారు.

వచ్చే ఏడాది జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నోట్ట రద్దు ప్రభావం శరాఘాతంగా తగులుతుందని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ ఎస్పీతో పొత్తు పెట్టుకొని ఈ ఎన్నికల్లో గణనీయంగా లబ్ధి పొందాలని ఆ పార్టీ ఎత్తుగడ. పొత్తు ఏర్పాటుదిశగా తెరవెనుక మంతనాలు సాగుతున్నాయని కాంగ్రెస్‌ పార్టీ నేత ఒకరు తెలిపారు. యూపీలో కాంగ్రెస్‌ అధికారం కోల్పోయి 27 ఏళ్లు అవుతోంది. మళ్లీ అధికార పీఠాన్ని ఆ పార్టీ ఆశించకపోయినా ఎస్పీతో పొత్తు పెట్టుకుంటే ఎంతలేదన్న 60-70 సీట్లు తమకు కేటాయించాలని హస్తం కోరే అవకాశముంది. ప్రస్తుతం కాంగ్రెస్‌కు 20 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఉన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement