న్యూఢిల్లీ: వైద్య విద్యార్థులకు మూలకణ చికిత్సపై అవగాహన కలిగించేందుకుగాను ఎంబీబీఎస్ అకడమిక్ కరికులంలో మూలకణ మార్పిడి అధ్యాయాన్ని ప్రవేశపెట్టాలని భారత వైద్య మండలి(ఎంసీఐ) యోచిస్తోంది. ఈ మేరకు కొత్త అధ్యాయాన్ని ప్రవేశపెట్టాలన్న ప్రతి పాదనను ఎంసీఐ పరిశీలిస్తోంది. ప్రతిపాదన ప్రకారం... మూలకణ మార్పిడి చికిత్సల పద్ధతులు, ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రత్యేక అధ్యాయం రూపొందిస్తారు. ముఖ్యంగా రక్తం సంబంధిత సమస్యలకు చేసే మూలకణ మార్పిడి చికిత్సలకు ప్రాధాన్యం ఉంటుందని ఆదివారమిక్కడ అతర్జాతీయ ఎముక మజ్జ మార్పిడి సదస్సులో ప్రసంగిస్తూ ఎంసీఐ సభ్యుడు నవీన్ దాంగ్ తెలిపారు.
దేశంలో మూలకణ దానం, మార్పిడిపై అవగాహన తక్కువగా ఉందని, సిలబస్‌లో కొత్త అధ్యాయం వల్ల వైద్య డిగ్రీ పట్టభద్రుల్లో దీనిపై అవగాహన కల్పించవచ్చన్నారు.