టీఆర్‌ఎస్ ఫండ్ కోసమే వాటర్‌గ్రిడ్
రైతు ఆత్మహత్యలను సర్కార్ పట్టించుకోవడం లేదు
{పజాకోర్టులో కేసీఆర్ {పభుత్వాన్ని నిలదీస్తాం
మహాధర్నాలో టీడీపీ, బీజేపీ నాయకుల హెచ్చరిక
నిజామాబాద్ అర్బన్/ఇందూరు: రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు నానాటికీ పెరుగుతున్నా సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ ఆరోపించారు. టీఆర్‌ఎస్ పార్టీ ఫండ్ కోసమే వాటర్‌గ్రిడ్ పథకాన్ని తీసుకొచ్చారని, ఆ నిధులను నాయకుల నుంచి కార్యకర్తల వరకు పంచుకుంటున్నారన్నారు. నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట గురువారం టీడీపీ, బీజేపీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భం గా రమణ మాట్లాడుతూ కేసీఆర్ పాలన మాఫియాను తలపిస్తోందన్నారు. అసెంబ్లీని మూడు రోజుల ముందే ముగించారని, సీఎం కేసీఆర్‌కు సమస్యలపై మాట్లాడే సత్తా లేదని ఎద్దేవా చేశారు.
మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి రైతులకు గ్రహచారంగా మారాడని దుయ్యబట్టారు. టీడీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ అనారోగ్యంతోనే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని మంత్రి పోచారం అనడం విడ్డూరంగా ఉందని, మరి జబ్బులున్న పోచారం, కేసీఆర్ ఎందుకు ఆత్మహత్య చేసుకోవడం లేదని ప్రశ్నిం చారు. డిసెంబర్‌లో తన కూతురు పెళ్లి కాగానే.. కేసీఆర్ పెళ్లి చేస్తానని హెచ్చరించారు. రైతు ఆత్మహత్యలను నివారించకపోవడం సిగ్గుచేటని టీటీడీ ఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. ఈ సందర్భంగా ‘నువ్వు కేసీఆర్ ఫాంహౌస్‌కు ఎం దుకు వెళ్లావో చెప్పు.’ అని శ్రావణ్‌కుమార్ అనే వ్యక్తి ఎర్రబెల్లిని నిలదీశాడు. దీంతో అతడిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఒకేసారి రుణమాఫీ చేస్తే రైతు ఆత్మహత్యలు జరిగేవి కావని బీజేపీ ఎల్పీ నేత డాక్టర్ లక్ష్మణ్ అన్నారు.