పుణే: నగరంలోని హడప్సర్ ప్రాంతంలో ఈ నెల 2వ తేదీన జరిగిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హత్య కేసుకు సంబంధించి పోలీసులు మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఛత్రపతి శివాజీ, శివసేన వ్యవస్థాపకులు బాల్‌ఠాక్రేలపై ఫేస్‌బుక్‌లో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు పోస్ట్ చేశారన్నఅనుమానంతో హిందూ రాష్ట్ర సేనకు చెందిన వ్యక్తులుగా భావిస్తున్న కొందరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మొహసిన్ షేఖ్‌ను కొట్టి చంపిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఇప్పటిదాకా 17 మందిని అరెస్టు చేసిన పోలీసులు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటిదాకా అరెస్టయినవారి సంఖ్య 19కి చేరింది.
ఇదిలాఉండగా దాడికి పాల్పడినట్లుగా భావిస్తున్న హిందూ రాష్ట్ర సేనను నిషేధించాలనే వాదనలు రోజురోజుకు బలంగా వినిపిస్తున్నాయి. రాష్ట్ర టెక్స్‌టైల్, మైనార్టీ అభివృద్ధిశాఖ మంత్రి న సీమ్‌ఖాన్ ఈ సంస్థను నిషేధించాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.