వాషింగ్టన్: ఫ్రాన్స్‌లో విహారయాత్రకు వెళ్లి ఇద్దరు అమెరికన్లను ఉగ్రనరమేధం బలిగొంది. అమెరికాకు చెందిన 51 ఏళ్ల సీన్ కోప్‌ల్యాండ్, ఆయన 11 ఏళ్ల కొడుకు బ్రాడీ ఫ్రాన్స్‌లోని నీస్ నగరంలో జరిగిన ఉగ్రదురాగతంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. గురువారం రాత్రి నీస్ నగరంలో ఫ్రాన్స్ స్వాతంత్ర్య దినోత్సవమైన బాస్టిల్ డే వేడుకల్లో ఓ ఉగ్రవాది ట్రక్కులో ఆయుధాలతో వచ్చి సంబరాల్లో ఉన్న జనంపైకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నరమేధంలో 84మంది మృతి చెందారు. ఇందులో ఇద్దరు అమెరికన్లు ఉన్నారని, ఇంకా వారి వివరాలు తెలియరాలేదని అమెరికా విదేశాంగ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ తెలిపారు.
అయితే, స్థానిక మీడియా మృతుల వివరాలు వెల్లడించింది. సీన్ కోప్‌లాండ్ తన కొడుకు బార్డీతో కలిసి ఫ్రాన్స్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు వెళ్లాడని, అక్కడ వేడుకలు వీక్షిస్తుండగా ఉగ్రవాది జరిపిన నరమేధంలో వారిద్దరూ ప్రాణాలు విడిచారని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఘటనతో టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో నివసించే కోప్‌లాండ్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
విహారయాత్రకు వెళ్లిన తండ్రీకొడుకులూ..!
Published Fri, Jul 15 2016 5:36 PM | Last Updated on Thu, Apr 4 2019 4:27 PM
Advertisement