terror attack in Nice
-
‘ఈ తరహా దాడులను నివారించడం కష్టమే’
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్, పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 43 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఉగ్రవాది ఓ స్కార్పియో ఎస్‌యూవీలో దాదాపు 350 కేజీల అత్యాధునిక పేలుడు పదార్థాన్ని (ఐఈడీ) నింపుకుని భద్రతాబలగాల కాన్వాయ్‌లో ప్రవేశించాడు. అనంతరం తన కారును కాన్వాయ్‌లోని ఓ బస్సుకు ఢీకొట్టి తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ విషయం గురించి ఇంటిలిజెన్స్ అధికారి ఒకరు మాట్లాడుతూ... ‘కొన్ని రోజుల ముందే ఈ తరహా దాడుల గురించి చర్చించాము. ఇలాంటి దాడులు ఎక్కువగా సిరియాలో జరుగుతుంటాయి. ముష్కరులు కూడా ఏదో ఒక రోజు మన దగ్గర ఇదే ప్రయోగాన్ని అమలు చేస్తారని భావించాం. కానీ అది ఇంత త్వరగా వస్తుందని అనుకోలేదు. ఈ తరహా దాడులను ముందుగా గుర్తించడం, నివారించడం కాస్తా కష్టమైన పనే. ఎందుకంటే సాధరణంగా దాడులకు తెగబడే వారు ట్రాఫిక్ ఎక్కువగా ఉండే సమయాన్ని ఎంచుకుని విధ్వంసం సృష్టిస్తారు. ఇలాంటప్పుడు రోడ్డు మీద ఉన్న అన్ని వాహనాలను పూర్తిగా పరిశీలించడం కుదరదు. ఫలితంగా దాడులను నియంత్రించడం సాధ్యమయ్యే పని కాదు’ అన్నారు. అయితే ‘ఈ సమస్య పరిష్కారానికి రెండు దారులు ఉన్నాయి. ఒకటి.. జవాన్ల కాన్వాయ్‌లను ట్రాఫిక్ లేని సమయంలో అంటే రాత్రి పూట లేదా తెల్లవారుజామున తరలించాలి. అప్పుడు తక్కువ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి అన్ని వాహనాలను జాగ్రత్తగా పరీక్షించవచ్చు. లేదా.. భద్రతాబలగాల కాన్వాయ్‌ల తరలింపు పూర్తయ్యవరకే ఆయా మార్గాల్లో వాహనాలు తిరగకుండా రోడ్డును బ్లాక్ చేయాలి. ప్రస్తుతం ఉన్న పరిష్కారాలు ఇవే. వీటి గురించి మరింత లోతుగా చర్చించాలని భావిస్తోన్న నేపథ్యంలో ఈ దాడి జరగడం విచారకరమ’ని తెలిపారు. అంతేకాక గతంలో సాయుధుడు ఆర్మీ శిబిరంలోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడటం, లేదంటే బాంబులు విసరడం లాంటివి చేసేవారన్నారు. మిలిటరీ శిబిరంలోకి చొరబడి సైనికులు తేరుకునే లోపే చేయాల్సినంత నష్టం చేయడమే లక్ష్యంగా వారు తెగబడుతారని తెలిపారు. కానీ ముష్కరులు కూడా కొత్త వ్యూహాలు పన్నుతున్నారని.. ప్రస్తుత దాడి జరిగిన తీరు చూస్తే ఈ విషయం అర్థమవుతుందన్నారు. -
ఆ కిరాతకుడు వీడే!
ఫ్రాన్స్‌లోని నీస్ నగరంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకొంటున్న ప్రజలపై నిర్దాక్షిణ్యంగా ట్రక్కుతో దూసుకెళ్లి మారణహోమాన్ని సృష్టించిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదిని పోలీసులు గుర్తించారు. ఈ అమానుష కిరాతకంలో పదిమంది చిన్నారులు సహా 84 మంది మృతిచెందారు. ఫ్రెంచ్-ట్యునీషియన్ అయిన 31 ఏళ్ల మహమద్ లహోహెజా బౌలెల్ అనే వ్యక్తి ఈ దుర్మార్గానికి కారణమని పోలీసులు కనుగొన్నట్టు స్థానిక పత్రిక 'నీస్ మాటిన్' తెలిపింది. మహమద్‌కు పెళ్లి అయిందని, ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారని తెలిపింది. నీస్‌లో గురువారం రాత్రి పేవ్మెంటు మీద వేడుకల్లో మునిగిపోయిన ప్రజలపైకి ట్రక్కును పోనిచ్చి మహమద్ నరమేధాన్ని సృష్టించాడు. అతడు దూసుకుపోయిన మేరకు కుప్పలుతెప్పలుగా గాలిలోకి మనుషులు ఎగిరిపడ్డారని, సంఘటనా ప్రాంతంలో ఎక్కడా చూసిన రక్తపుమడుగులు ప్రజల మృతదేహాలు పడి ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ నరమేధం ప్రారంభమైన అరగంట తర్వాత భద్రతా దళాలు సాహసోపేతంగా జరిపిన కాల్పుల్లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాది ప్రాణాలు విడిచాడని, అతను వాహనంలో ఉండగానే భద్రతాదళాలు కాల్పులు జరిపాయని, నేరుగా బుల్లెట్లు తగలడంతో వాహనం నడుపుతూనే అతను ప్రాణాలు విడిచాడని చెప్పారు. -
విహారయాత్రకు వెళ్లిన తండ్రీకొడుకులూ..!
వాషింగ్టన్: ఫ్రాన్స్‌లో విహారయాత్రకు వెళ్లి ఇద్దరు అమెరికన్లను ఉగ్రనరమేధం బలిగొంది. అమెరికాకు చెందిన 51 ఏళ్ల సీన్ కోప్‌ల్యాండ్, ఆయన 11 ఏళ్ల కొడుకు బ్రాడీ ఫ్రాన్స్‌లోని నీస్ నగరంలో జరిగిన ఉగ్రదురాగతంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. గురువారం రాత్రి నీస్ నగరంలో ఫ్రాన్స్ స్వాతంత్ర్య దినోత్సవమైన బాస్టిల్ డే వేడుకల్లో ఓ ఉగ్రవాది ట్రక్కులో ఆయుధాలతో వచ్చి సంబరాల్లో ఉన్న జనంపైకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నరమేధంలో 84మంది మృతి చెందారు. ఇందులో ఇద్దరు అమెరికన్లు ఉన్నారని, ఇంకా వారి వివరాలు తెలియరాలేదని అమెరికా విదేశాంగ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ తెలిపారు. అయితే, స్థానిక మీడియా మృతుల వివరాలు వెల్లడించింది. సీన్ కోప్లాండ్ తన కొడుకు బార్డీతో కలిసి ఫ్రాన్స్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు వెళ్లాడని, అక్కడ వేడుకలు వీక్షిస్తుండగా ఉగ్రవాది జరిపిన నరమేధంలో వారిద్దరూ ప్రాణాలు విడిచారని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఘటనతో టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో నివసించే కోప్లాండ్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.