బయటపడ్డ 50 కేజీల బాంబు
లండన్: పేలకుండా ఉన్న రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి 50 కేజీల బాంబు ఒకటి బ్రిటన్ లో బయటపడింది. లండన్ లోని వెంబ్లె జాతీయ ఫుట్ బాల్ మైదానానికి సమీపంలో దీన్ని కనుగొన్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సమీపంలో నివసిస్తున్న వారిని ఖాళీ చేయిస్తున్నారు. ఇది పేలితే 4 00 మీటర్ల వరకు తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు ఒక ప్రకటనలో హెచ్చరించారు.
50 కేజీల బరువు ఉన్న ఈ బాంబు 1940కు ముందు లండన్ పై జర్మనీ విసిరిందిగా భావిస్తున్నారు. ఎటువంటి ప్రమాదం జరగకుండా దీన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, ప్రజలు సహకరించాలని లండన్ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. గత మార్చి నెలలో ఆగ్నేయ లండన్ లోని బెర్మాండ్ సేలో 250 కేజీల బాంబును గుర్తించి, సురక్షితంగా నిర్వీర్యం చేశారు.