సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేయాలని యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్(యూపీఎస్సీ)ను కేంద్ర ప్రభుత్వం కోరింది.
న్యూఢిల్లీ: సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేయాలని యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్(యూపీఎస్సీ)ను కేంద్ర ప్రభుత్వం కోరింది. సిలబస్, పరీక్షా విధానంపై స్పష్టత వచ్చేంత వరకు పరీక్ష వాయిదా వేయాలని యూపీఎస్సీని కోరినట్టు కేంద్రమంత్రి జితేంద్రసింగ్ తెలిపారు. అన్నివర్గాలు చేస్తున్న డిమాండ్లపై కమిటీ నియమించాలని సూచించినట్టు చెప్పారు.
సివిల్ సర్వీసెస్ అప్టిట్యూట్ టెస్ట్(సీఎస్ఏటీ)ను రద్దు చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ప్రిలిమినరీ పరీక్ష ఈ ఏడాది ఆగస్టు 24న జరగాల్సివుంది. మెయిన్స్ డిసెంబర్ 14వ తేదీన జరిగే అవకాశముంది.