న్యూఢిల్లీ: ఉదంపూర్లో బీఎస్ఎఫ్ కాన్వాయ్పై పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడి చేసిన ఘటనకు సంబంధించి కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటన చేయనున్నారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు.
పార్లమెంటు ఉభయ సభల్లో ఈ ప్రకటన చేస్తారని, దేశ భద్రతకు సంబంధించిన అంశాలతోపాటు, భవిష్యత్తులో తీసుకోనున్న చర్యలపై కూడా ఆయన ప్రకటన చేయనున్నారు. ప్రశ్నోత్తరాల అనంతరం ఆయన ఈ ప్రకటన చేస్తారని వెంకయ్యనాయుడు చెప్పారు. ఇదిలా ఉండగా, ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన బీఎస్ఎఫ్ జవాన్ల త్యాగం ఎప్పటికీ గుర్తుంచుకోదగినదని రాజ్ నాధ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. వారికి గౌరవ వందనం చేస్తున్నట్లు తెలిపారు.
ఉదంపూర్ ఘటనపై హోంమంత్రి ప్రకటన
Published Thu, Aug 6 2015 10:29 AM | Last Updated on Sun, Sep 3 2017 6:55 AM
Advertisement
Advertisement