భారత పట్టణాల్లో ఉపయోగించని వస్తువుల మార్కెట్ రూ.22,000 కోట్లని క్రస్ట్ సర్వే వెల్లడించింది. ప్రముఖ మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఐఎంఆర్‌బీ ఇంటర్నేషనల్‌తో కలిసి ఓఎల్‌ఎక్స్ సంస్థ ఈ క్రస్ట్ సర్వేని నిర్వహించిందని ఓఎల్‌ఎక్స్‌డాట్‌ఇన్ సీఈవో అమ్రిత్ బాత్రా ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్: భారత పట్టణాల్లో ఉపయోగించని వస్తువుల మార్కెట్ రూ.22,000 కోట్లని క్రస్ట్ సర్వే వెల్లడించింది. ప్రముఖ మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఐఎంఆర్‌బీ ఇంటర్నేషనల్‌తో కలిసి ఓఎల్‌ఎక్స్ సంస్థ ఈ క్రస్ట్ సర్వేని నిర్వహించిందని ఓఎల్‌ఎక్స్‌డాట్‌ఇన్ సీఈవో అమ్రిత్ బాత్రా ఒక ప్రకటనలో తెలిపారు. ఓఎల్‌ఎక్స్ కన్సూమర్ రీసెర్చ్ ఆన్ యూజ్‌డ్-గూడ్స్ అండ్ సెల్లింగ్ ట్రెండ్స్(క్రస్ట్) పేరుతో దేశంలోని 4 ప్రాంతాల్లోని 12 నగరాల్లో ఈ సర్వే నిర్వహించామని పేర్కొన్నారు.
దేశంలో ఏ నగరంలో లేనంతగా ముంబైలో ఉపయోగించని వస్తువులున్నాయని వివరించారు. ఇలాంటి వస్తువుల్లో అధిక భాగం వంట పాత్రలు, గృహోపకరణాలు, మొబైల్ ఫోన్‌లు, బట్టలు, వాచీలు, పుస్తకాలు ఉన్నాయన్నారు.