
త్రిపాత్రాభినయం.. ముగ్గురు టాప్ హీరోయిన్లు
అగ్ర హీరోల సినిమాలకు సంబంధించిన ఏ వార్త అయినా వారి అభిమానులకు ఆనందాన్నిస్తుంది.
చెన్నై: అగ్ర హీరోల సినిమాలకు సంబంధించిన ఏ వార్త అయినా వారి అభిమానులకు ఆనందాన్నిస్తుంది. తమిళ అగ్రహీరో విజయ్ తాజా సినిమా 'మెర్సల్' సంబంధించి పలు ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. విజయ్ త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, సమంత, నిత్యామీనన్‌లు నాయికలుగా నటిస్తున్నారు.
తెరి వంటి సూపర్‌హిట్ చిత్రం తరువాత విజయ్, దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీతేనాండాల్ ఫిలింస్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా? అని విజయ్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. వారికో సంతోషకరమైన వార్త ఏమిటంటే ఏఆర్ రెహ్మాన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్ర ఆడియోను ఆగస్ట్ 20న విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు అధికారికంగా శుక్రవారం వెల్లడించాయి. సోనీ మ్యూజిక్ సంస్థ ఈ పాటల హక్కులను పొందింది. దీపావళి రేసులో బరిలోకి దిగేందుకు ఈ చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.