కోహ్లికి అనుష్క బర్త్ డే సర్‌ప్రైజ్!
టీమిండియా డ్యాషింగ్ క్రికెటర్ విరాట్ కోహ్లి శనివారం 28వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా ప్రియురాలు అనుష్క శర్మ రాజ్‌కోట్‌లో కోహ్లిని కలిసి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నది. ఈ నెల 9 నుంచి రాజ్‌కోట్‌లో ఇంగ్లండ్‌తో జరిగే తొలి టెస్టు కోసం టీమిండియా ఇక్కడ ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్న సంగతి తెలిసిందే.
క్రికెట్ వీరుడు విరాట్, బాలీవుడ్ భామ అనుష్క గతకొంతకాలంగా ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. విభేదాలు కారణంగా వీరు విడిపోయినట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఈ బ్రేకప్ కాలంలో ఒకరి ముఖం ఒకరు చూసుకోలేదు. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు మాయమై.. మళ్లీ ప్రేమలో మునిగితేలుతున్నారని సన్నిహితులు చెప్తున్నారు.