బెహన్‌జీ.. పరిస్థితి అర్థం చేసుకోవచ్చు!
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ దారుణంగా చతికిలపడింది. 403 స్థానాల ఉన్న యూపీలో ఆ పార్టీ కేవలం 21 స్థానాల్లో గెలుపు దిశగా ప్రయాణిస్తూ ఘోరంగా మూడో స్థానానికి పరిమితం అయింది. ఈ ఫలితాలపై మాయావతి స్పందిస్తూ విస్మయం వ్యక్తం చేశారు. ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే బీజేపీ గెలిచిందని ఆమె ఆరోపించారు. ఏ గుర్తుకు ఓటేసినా బీజేపీకే వెళ్లిందని, బీజేపీకి దమ్ముంటే బ్యాలెట్ పేపర్‌తో ఓటింగ్‌కు సిద్ధం కావాలని సవాల్ విసిరారు.
ఆమె ఆరోపణలపై స్పందించడానికి తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిరాకరించారు. ప్రస్తుత ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బెహన్‌జీ పరిస్థితి అర్థం చేసుకోవచ్చునని, ఆమె వ్యాఖ్యలపై తాను స్పందించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.