'ఆ నిర్ణయం అహంకారానికి నిదర్శనం' | we dont agree naga pact: sonia gandhi | Sakshi
Sakshi News home page

'ఆ నిర్ణయం అహంకారానికి నిదర్శనం'

Published Thu, Aug 6 2015 11:01 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

'ఆ నిర్ణయం అహంకారానికి నిదర్శనం' - Sakshi

'ఆ నిర్ణయం అహంకారానికి నిదర్శనం'

న్యూఢిల్లీ: నాగా శాంతి ఒప్పందం విషయంలో అధికార పక్షంపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మరోసారి విరుచుకుపడింది. ఆ పార్టీ నేతలు, ఎంపీలందరితో కలిసి మూడో రోజు పార్లమెంటులోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ ఎన్డీయే ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. మోదీ తీరుపై మండిపడ్డారు.

ఈ సందర్భంగా పార్టీ నేతలంతా కలిసి ఎన్డీయే సర్కార్ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా సోనియాగాంధీ మాట్లాడారు. నాగాలాండ్ శాంతి ఒప్పందం తమకు ఏమాత్రం సమ్మతం కాదని అన్నారు. ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులను సంప్రదించకుండా ఒప్పందం ఎలా చేస్తారని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ అహంకారానికి ఈ ఒప్పందం ఒక నిదర్శనం అని సోనియాగాంధీ తీవ్రంగా విమర్శించారు. ఈ ఆందోళన కార్యక్రమానికి రాహుల్ గాంధీ నేతృత్వం వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement