సమైక్యాంధ్రప్రదేశ్కు అనుకూలం: మమత | we support samaikyandhra pradesh, says mamata banerjee | Sakshi
Sakshi News home page

సమైక్యాంధ్రప్రదేశ్కు అనుకూలం: మమత

Published Tue, Dec 10 2013 12:55 PM | Last Updated on Wed, Oct 17 2018 6:18 PM

సమైక్యాంధ్రప్రదేశ్కు అనుకూలం: మమత - Sakshi

సమైక్యాంధ్రప్రదేశ్కు అనుకూలం: మమత

న్యూఢిల్లీ : సమైక్యాంధ్ర ప్రదేశ్కు తాను అనుకూలమని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఇదివరకే తన వైఖరిని స్పష్టం చేశానని అన్నారు. యూపీఏ సర్కార్పై సీమాంధ్ర ఎంపీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి తాము ఖచ్చితంగా మద్దతు తెలుపుతామని ఆమె తెలిపారు.

పార్లమెంట్ సమావేశాల అనంతరం మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీలకు తాము సమదూరమన్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా ప్రజలు కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత చూపుతున్నారని అన్నారు. దేశంలో కాంగ్రెస్కు స్థానం లేదని ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయని మమత అన్నారు. ప్రాంతీయ పార్టీలన్ని ముందుకు వచ్చి స్థిర ప్రభుత్వాన్ని కోరుకుంటే దేశ ముఖచిత్రం మారిపోతుందన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement